సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
Sakshi Education
చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ సైనిక్ స్కూ ల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఇన్నోవేషన్ చాలెంజ్ గ్రాండ్ ఫినాలెలో విద్యార్థులు కె. నరేశ్, కె. హోమ్‌రాజ్, జి. విలోహిత్, కె. ప్రజ్ఞాన్ విశ్వాస్ ‘ఏ కాక్ హెల్మెట్’ ప్రాజెక్ట్ ప్రదర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించిన వాటిలో 70 ఎంపిక కాగా సైనిక్ విద్యార్థుల ప్రదర్శన ఒకటి. పాఠశాలకు చెందిన గౌతమీకృష్ణ సూచనలతో ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించిన వాహనదారుడి నుంచి లైవ్ లొకేషన్‌తో పాటు యాక్సిడెంట్ అలర్ట్‌ను హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌కు మెసేజ్ పంపిస్తుంది. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో రాష్ట్ర కోఆపరేటీవ్ అపెక్స్ బ్యాంకు, కోఆపరేటీవ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల గ్రాండ్ ఫినాలెలో ప్రాజెక్ట్ ప్రశంసలు పొందింది. ఈసందర్భంగా విద్యార్థులను, గైడ్ పాఠశాల డైరెక్టర్ పీఆర్ రవికుమార్, ప్రిన్సిపాల్ లచ్చయ్య, ఉపాధ్యాయులు అభినందించారు. ఇన్నోవేషన్ చాలెంజ్ గ్రాండ్ ఫినాలెలో ఆకట్టుకున్న ‘ఏ కాక్ హెల్మెట్’ ప్రాజెక్ట్
Published date : 23 Jun 2023 03:36PM