International Level Chess: జూన్‌లో జరిగే అంతర్జాతీయ చదరంగం పోటీలకు ఎంపికైన విద్యార్థులు వీరే..
ఏలూరు రూరల్: చదరంగం సాధనతో పిల్లల్లో ఆలోచన శక్తి పెరుగుతుందని సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మీ అన్నారు. శుక్రవారం ఏలూరు సమీపం వట్లూరులోని శ్రీసిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ ఆవరణలో ఒక్కరోజు రాష్ట్రస్థాయి రాపిడ్ చెస్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీలక్ష్మీ మాట్లాడుతూ చెస్ పోటీలు నిర్వహించడం వల్ల పిల్లల తెలివితేటలకు పదును పెరుగుతుందన్నారు.
Education department: పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధం.. పరీక్ష తేదీలు ఇవే!
అనంతరం విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న డి.లక్ష్మణరావు, వి.అభిరామ్, ఎల్. మౌళి, ఎం. బాల శ్రీనివాసరావు, సీహెచ్ వివేక్, ఎం.శ్రీనివాసరావు, ఎల్.అరవింద్‌బాబు, జి.అరుణకుమారి, జి.హరీష్, ఎన్. వినయ్ బాలసాయికృష్ణ విజయం సాధించారన్నారు. వీరంతా భీమవరంలో జూన్ 4 నుంచి 9 వరకూ జరిగే అంతర్జాతీయ చదరంగం పోటీల్లో పాల్గొంటారని తెలిపారు పోటీల పర్యవేక్షుడు, అబ్రహం, గ్యారీకాస్పొరొవ్ అకాడమీ డైరెక్టర్ జి.యెహనాన్ చెప్పారు.
Skill Development Centres: ప్రతి సెగ్మెంట్‌లోనూ స్కిల్ సెంటర్: చిన్నారెడ్డి