సీఓఈ సెట్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
- రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కు ముగ్గురు ఎంపిక
- రాష్ట్ర స్థాయి సీఓఈల్లో తొమ్మిది మంది..
బెల్లంపల్లి: తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించిన సీఓఈ సెట్ ఫలితాల్లో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సైనిక్‌స్కూల్, సీఓఈల్లో ప్రవేశానికి వేర్వేరుగా నిర్వహించిన సీఓఈ సెట్–2023 ఫలితాలు బుధవారం వెల్లడయ్యాయి. కరీంనగర్‌లోని రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌లో ప్రవేశానికి దుర్గం సంజయ్, ఎస్కిల్ల రిషిక్, కాంపల్లి జశ్వంత్ ఎంపీసీ విభాగంలో అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయిలో ఐఐటీ, నీట్‌లలో శిక్షణ కేంద్రాలైన సీఓఈలు నాలుగు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి తొమ్మిది మంది అర్హత సాధించారు. వీరిలో ఐల సాయిరాం, గొర్లపల్లి సాత్విక్, కాసర్ల భువన్‌తేజ(బైపీసీ–గౌలిదొడ్డి), దుగుట హరీష్, ముడిమడుగుల సాయిచరణ్‌తేజ(ఎంపీసీ–గౌలిదొ డ్డి), కొండగొర్ల సిద్ధార్థ(ఎంపీసీ–చిలుకూరు), ఉదరుకోట శ్రీహర్షన్, ఇల్లందుల మణితేజ(బైపీసీ–చిలుకూరు), కనుకుంట్ల రామ్‌చరణ్‌తేజ(ఎంపీసీ–షేక్‌పేట) ఉన్నారు. విద్యార్థుల ఎంపికపై ప్రిన్సిపాల్ సైదులు, ఉపాధ్యాయులను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆదిలాబాద్ రీజియన్ కోఆర్డినేటర్ కొప్పుల స్వరూపారాణి అభినందించారు. ప్రిన్సిపాల్ సైదులుకు ఉపాధ్యాయులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ కోట రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, దత్తప్రసాద్, ప్రమోద్‌కుమార్, రామారావు, ప్రేమలత, సమంధర్, తేజస్వీ పాల్గొన్నారు.