Skip to main content

Dr. BR Ambedkar University: అకడమిక్‌ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి

Grievance cell for students and employees   Vice Chancellor Professor KR Rajini   Etcherla Campus of Dr BR Ambedkar University

ఎచ్చెర్ల క్యాంపస్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో అకడమిక్‌ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేఆర్‌ రజిని అన్నా రు. వర్సిటీ వీసీ కార్యాలయంలో ఆమె గురువారం మాట్లాడారు. ప్రస్తుతం ఆర్ట్స్‌, కామర్స్‌, లా కోర్సులకు సంబంధించి క్లాస్‌వర్క్‌ సమయం మార్చిన ట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి 11 కోర్సులకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు క్లాస్‌వర్క్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విద్యార్థులు పోటీ పరీక్షలకు చదవ టం, పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకోవటం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు క్లాస్‌వర్క్‌ జరుగుతుంద ని, ఈ సమయం మార్పునకు సంబంధించి విద్యా ర్థుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటామని తెలిపారు. సైన్స్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రయోగాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. త్వరలో క్లాస్‌వర్క్‌ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. గ్రీవెన్స్‌ సెల్‌ ఫిర్యాదుల ఆధారంగా గత వీసీ నియమించిన 34 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ, 24 కాంట్రా క్టు బోధకుల తొలగింపు, వారిలో నచ్చిన వారిని కొనసాగించటం, 2008 నుంచి వర్సిటీలో చేపట్టిన నియామకాలు, పాటించిన రిజర్వేషన్‌ రోస్టర్‌కు సంబంధించి నియమించిన ఉదయ్‌భాస్కర్‌, అనురాధ, స్వప్నవాహిణి కమిటీలు నివేదికలు ఈ నెల చివరి నాటికి అందజేస్తాయని అన్నా రు. ఈ నివేదికలు పాలక మండలి సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. గత పాలక మండలి సభ్యుని భార్య ఇంజినీరింగ్‌లో కాంట్రాక్టు పద్ధతిలో అక్రమ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నియామకంపై దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు. పారదర్శక, అవినీతి రహిత విశ్వవిద్యాలయం లక్ష్యమని పేర్కొన్నారు. వర్సిటీకి నాక్‌ బి గ్రేడ్‌ ఉందని, బీ ప్లస్‌ గ్రేడు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. లైబ్రరీని పూర్తి గా విద్యార్థుల అవసరాలను అనుగుణంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రతి శనివారం పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు ఎలాంటి సమస్యలు ఎదురైనా గ్రీవెన్స్‌ సెల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. ఆమెతో పాటు రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బిడ్డిక అడ్డయ్య ఉన్నారు.
 

Published date : 24 Feb 2024 10:17AM

Photo Stories