Schools Holidays : రేపు స్కూళ్లకు సెలవు.. కారణం ఇదే
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు ఆగస్టు 27వ తేదీన(నాలుగో శనివారం) సెలవు దినంగా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
ఈ మేరకు కమిషనర్ కె.సురేష్‌కుమార్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఆగస్టు 13వ తేదీ(రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేశాయి.సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Published date : 26 Aug 2022 04:01PM