Nobel Laureate Michael Kremer: విద్యా సంస్కరణలు రాష్ట్రంలో భేష్
పెదపాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాసంస్కరణలు భేష్ అని, ప్రభుత్వం అందించే సాంకేతిక విద్యావిధానంలో విద్యార్థులు పూర్తి మూర్తిమత్వం పొందుతారని నోబెల్ అవార్డు గ్రహీత మైకేల్ రాబర్ట్ క్రెమర్ (అమెరికా) ప్రశంసించారు. క్రెమర్‌తోపాటు చికాగోలోని దిల్ యూనివర్సిటీకి చెందిన ఎమిలీ క్యుపిటో బృందం పర్సనలైజ్డ్ అడాప్టివ్ లె ర్నింగ్ (పాల్) ప్రాజెక్టు అమలు చేస్తున్న పాఠశాలల సందర్శనలో భాగంగా రాష్ట్ర కమిటీతో పాటు క్రెమర్ గురువారం మండలంలోని కలపర్రు జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించారు. పాఠశాలలో ట్యాబ్‌లు, బైజూస్ కంటెంట్‌తోపాటు ఇతర బోధనోపకరణాలు, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి ల్యాబ్ వినియోగం వల్ల ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో అభివృద్ధి చేయా ల్సిన విషయాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. ట్యాబ్‌ల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాల్ ప్రాజెక్టు అమలుచేస్తున్న పాఠశాలల్లో సేవలను అధికారులు ఆయనకు వివరించారు. పాల్ ప్రాజెక్టు అమలులో ఆంధ్రప్రదేశ్ క్రెమర్ అత్యంత ప్రాముఖ్యతగా నిలిచిందని సంతృప్తి వ్యక్తం చేశారు. పాల్ లాబ్స్ వ్యక్తిగత రాష్ట్ర కమిటీ కో–ఆర్డినేటర్ ఎన్‌వీ సత్యం, ఎంఈఓ సబ్బితి నర్సింహమూర్తి, ప్రధానోపాధ్యాయుడు భీమయ్య, పాల్ లాబ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ యోహాను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చదవండి: AP Educational Institutions: ఏపీ విద్యాసంస్కానికి ప్రశంసలు