NEET Eligibility for Open School Students: ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా నీట్‌కు అర్హులే, స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షకు అర్హులేనని సుప్రీంకోర్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా సీబీఎస్‌ఈ, రాష్ట్ర ప్రభుత్వాల చేత గుర్తింపు పొందిన ఓపెన్ స్కూళ్లలో 10+2 ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నీట్ పరీక్షకు అర్హులేనని స్పష్టం చేసింది.
ఆ నిబంధనను కొట్టి వేసిన కోర్టు
ఈ మేరకు జస్టిస్ ps నర్సింహా, అరవింద కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. గుర్తింపు పొందిన బోర్డ్స్ నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు నీట్ పరీక్ష రాయొచ్చని పేర్కొంది. గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 4(2)(a) బంధన ప్రకారం.. ఓపెన్ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు నీట్ పరీక్ష రాసేందుకు అర్హత ఉండేది కాదు.
2018లో ఢిల్లీ హైకోర్టు సైతం ఇది రాజ్యంగ విరుద్ధమని, ఈ నిబంధనను కొట్టివేసింది. దీంతో మెడికల్ కౌన్సిల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఓపెన్ స్కూల్స్‌లో చదువుకున్న విద్యార్థులకు ఊరట కల్పిస్తూ తీర్పును వెలువరించింది.