National Level Ranks: సైనిక్ స్కూల్ నుంచి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం అభినందనీయం..

నాగోలు: ప్రతి సంవత్సరం రేయాన్ సైనిక్ స్కూల్ నుంచి జాతీయ స్థాయిలో సైనిక్, నవోదయ, ఆర్.ఎమ్.ఎస్‌లో మొదటి ర్యాంకులు సాధించడం గర్వకారణమని మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ అన్నారు. గత 24 సంవత్సరాలు దేశానికి ఎంతో మంది డాక్టర్లను, సివిల్ సర్వెంట్లను, ఇంజనీర్లు అందించిన ఘనత రేయాన్ సైనిక్ స్కూల్‌కు దక్కడం అభినందనీయమని చెప్పారు.
2024, 25 సంవత్సరాల్లో ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపి సైనిక్, నవోదయ 6 వతరగతి, 9వ తరగతి ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల అభినందన సభను ఆదివారం నాగోలు బండ్లగూడలోని రేయాన్ సైనిక్ స్కూల్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందించి సన్మానించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న దిలీప్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ, నిబద్ధతతో కూడిన విద్యనందిస్తూ జాతీయ స్థాయిలో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేస్తున్న కోచింగ్ సెంటర్ యజమాన్యాన్ని అభినందించారు.
Re Union of Tenth Students: పదో తరగతి విద్యార్థుల స్వర్ణోత్సవ వేడుకలు..
రేయాన్ సైనిక్ స్కూల్స్ చైర్మన్ జి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్యూల్స్‌కి అత్యధిక మార్కులు 286, 284 లాంటి టాప్ మార్కులతో పాటు 81 మంది విద్యార్థులు ఎంపిక అవ్వడం తమ సంస్థ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. ఆర్‌ఐఎంసీకి తెలంగాణ నుండి గల ఏకైక సీటు తమ సంస్థ విద్యార్థులే దక్కించుకోవడం గర్వకారణమని తెలిపారు. డైరెక్టర్ ఉమారెడ్డి మాట్లాడుతూ మ్యాథ్స్‌లో ఆరుగురు విద్యార్థులు 150/150 మార్కులు సాధించడం తమకే సాధ్యమయిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు ఉత్తమ ర్యాంకులు సాధించేలా బోధించి ప్రోత్సహించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.