Breaking News: ఇకపై 6 పేపర్లే..పది పరీక్షలపై కీలక నిర్ణయం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షల నిర్వాహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
2021-22 విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షల పేపర్లను కుదించింది. దీంతో ఈ ఏడాది టెన్త్‌లో 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతో పరీక్షలు ఉండనున్నట్లు, ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పేపరే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు అక్టోబర్ 11వ తేదన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2020-21లో 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోగా.. 2021-22లో కూడా ఈ విధంగానే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
Published date : 11 Oct 2021 05:04PM