జేఈఈ.. ఆసక్తి తగ్గుతుందోయీ!
2014లో జేఈఈ మెయిన్స్ కోసం దేశవ్యాప్తంగా 13.57 లక్షలమంది దర ఖాస్తు చేసుకోగా గతేడాది ఈ సంఖ్య 10.48 లక్షలకు తగ్గింది. దరఖాస్తు చేసిన వారి లోనూ దాదాపు లక్ష మంది పరీక్ష రాసేం దుకు ఇష్టపడట్లేదు. రాష్ట్రాల ఎంసెట్ పేపర్ల తో పోలిస్తే జేఈఈ పరీక్ష పేపర్లు విశ్లేష ణాత్మకంగా ఉండటం, ప్రశ్నలు ఎక్కువ భాగం సుదీర్ఘంగా ఉండటం కూడా కారణ మని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యా ర్థులు ఎక్కువగా రాష్ట్రాల సెట్‌లపై దృష్టి పెడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రస్థాయి, కేంద్రస్థాయి సిలబస్‌లో ఉన్న కొన్ని చిక్కులవల్ల కూడా జేఈఈని విద్యా ర్థులు కఠినంగా భావిస్తూ క్రమంగా పరీక్షకు దూరమవుతున్నట్లు ఉందని చెబుతున్నారు.
రాష్ట్రాల్లోనూ పెరిగిన వనరులు
రాష్ట్ర పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో విసృ ్తత మౌలిక వసతులు, నాణ్యమైన ఉపాధి కోర్సుల్లో సీట్లు పెరగడం కూడా జేఈఈ హాజరు తగ్గడానికి ఓ కారణమని ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంక టరమణ తెలిపారు. అనేక రాష్ట్రాల్లో లా, టీచింగ్, ఎంబీఏ వంటి కోర్సుల వైపు విద్యా ర్థులు మళ్లుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఇంజనీరింగ్ తర్వాత విదేశీ విద్యకు వెళ్లాలనే ఆలోచన ఉన్నవారు జేఈఈ వంటి కష్టమైన పరీక్షల వైపు వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సైన్స్ కోర్సుల ప్రాధాన్యత పెరగడం వల్ల ఉపాధి అవకా శాలు మెరుగవుతున్నాయని, వాటి ఆధారం గా విదేశీ విద్య, అక్కడ ఉపాధి అవకా శాలు మెరుగవుతాయనే ఆలోచన కూడా జేఈఈకి విద్యార్థులు క్రమంగా దూరం జరగడానికి కారణమవుతోందని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొ.పాపిరెడ్డి చెప్పారు.
చదవండి:
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) గైడెన్స్
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) వీడియో గైడెన్స్
జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) ప్రివియస్ పేపర్స్
పట్టు సాధించలేక...
కరోనా లాక్‌డౌన్ సమయంలో కోచింగ్ సెంటర్లు మూతపడటం వల్ల విద్యార్థులు పెద్దగా సన్నద్ధమవ్వలేకపోయారని, ఈ ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోందని జేఈఈ గణిత శాస్త్ర అధ్యాపకుడు సత్యా నంద్ విశ్లేషించారు. 2021లో అన్ని రాష్ట్రా ల్లోనూ తొలుత ఆన్ లైన్ క్లాసులే జరగడంతో జేఈఈకి సిద్ధం కావడంపై పట్టు సాధించ లేకపోయామనే భావన విద్యార్థుల్లో ఉందని ఓ ప్రైవేటు కాలేజీలో రసాయనశాస్త్ర అధ్యా పకుడిగా పనిచేస్తున్న కొసిగి రామనాథం తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారిలో 30 శాతం మాత్రమే సీరియస్‌గా ప్రిపేపర్ అవు తున్నారని, మిగతావారు అరకొరగా సన్నద్ధ మయ్యే వాళ్లేనని 15 ఏళ్లుగా జేఈఈ కోచింగ్ ఇస్తున్న శ్యామ్యూల్ అభిప్రాయపడ్డారు.
2014 నుంచి జేఈఈ మెయిన్స్ కు వచ్చిన దరఖాస్తులు... హాజరైన అభ్యర్థులు
సంవత్సరం |
నమోదు |
హాజరు |
2014 |
13,57,002 |
12,90,028 |
2015 |
13,56,765 |
12,03,453 |
2016 |
12,34,769 |
12,07,058 |
2017 |
11,86,454 |
11,22,351 |
2018 |
11,35,084 |
10,74,319 |
2019 |
12,37,892 |
11,47,125 |
2020 |
11,74,938 |
10,23,435 |
2021 |
10,48,012 |
9,39,008 |