JAM 2024 Admit card out- జామ్ పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదల.. అసలేంటీ పరీక్ష అంటే..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్..JAM(జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఆఫ్ మాస్టర్స్)2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మీషన్స్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(IISc),నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వంటి విద్యాసంస్థల్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (M.Sc.), ఇతర పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షను జామ్ అంటారు.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11,2024
పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో ఉంటుంది
వయసు పరిమితి: ఎలాంటి వయసు పరిమితి లేదు
ఫలితాలు: మార్చి 2024లో ప్రకటిస్తారు
మొత్తం మార్కులు: 200
మొత్తం వ్యవధి: 3 గంటలు (2 పేపర్స్ ఉంటాయి. పార్ట్ A (జనరల్ ఆప్టిట్యూడ్),పార్ట్ B (డిసిప్లిన్ స్పెసిఫిక్)
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా అడ్మిట్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
మీ రూల్‌నెంబర్/ఫోన్ నెంబర్‌తో అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోండి.
మరిన్ని వివరాల కోసం https://joaps.iitm.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి