Skip to main content

AP SCERT ఆధ్వర్యంలో 'ఐబీ'... టీచర్లకు ట్రైనింగ్: CM YS Jagan

విద్యాశాఖపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమీక్ష.
CM YS Jagan  Education Department update  YS Jagan at CM's camp office

విద్యాశాఖ పై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్ధేశం చేశారు.

  • సర్కారు స్కూళ్లలో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్.
  • పాఠ్య ప్రణాళికలో ఆర్థిక పాఠాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 
  • అంతర్జాతీయంగా రాణించేలా విదేశీ భాషలు కూడా చేర్చాలని చెప్పారు.  
  • ఐబీ బోధనా విధానాల పై వచ్చే ఏడాది టీచర్లకు ట్రైనింగ్ ఇస్తారు. 
  • 2025-26లో ఒకటో తరగతిలో ఐబీ ప్రారంభించి... ఆపై ఏటా ఒక్కో తరగతిలో దశలవారీగా అమలు చేస్తారు. 
  • AP SCERT ఆధ్వర్యంలో ఐబీ అమలు, పర్యవేక్షణ ఉంటాయి. 
  • డిసెంబర్ లో విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

నాలుగు దశల్లో ప్రోగ్రాములు 

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఐబీ ప్రోగ్రాములు నాలుగు దశల్లో ఉంటాయి. 3 నుంచి 12 సంవత్సరాల వయసు విద్యార్థులకు ప్రైమరీ ఇయర్స్‌ ప్రోగ్రామ్‌ (పీవైపీ) అందిస్తారు. ఇందులో పిల్లలకు నేర్చుకునే ఆసక్తి పెంచడం, కమ్యూనికేషన్‌ స్కిల్స్, బేసిక్‌ నాలెడ్జ్, సొంతంగా ఆలోచించడం వంటివి నేర్పిస్తారు. ఈ ప్రోగ్రాంలో పరీక్షలు గానీ, గ్రేడింగ్‌ కానీ ఉండవు. పదేళ్ల ఈ ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత చివరలో సైన్స్‌ ఎగ్జిబిషన్‌ వంటిది నిర్వహించి పిల్లలను భాగస్వామ్యం చేస్తారు.  

  • కాగా, 11 నుంచి 16 సంవత్సరాల విద్యార్థులకు మిడిల్‌ ఇయర్స్‌ ప్రోగ్రామ్‌ (ఎంవైపీ) ఉంటుంది. ఇందులో విద్యార్థులకు ఆర్ట్స్, లాంగ్వేజ్, లాంగ్వేజ్‌ అక్విజిషన్, మ్యాథ్స్, డిజైన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, ఇండివిడ్యువల్స్‌ అండ్‌ సొసైటీస్, సైన్సెస్‌ అనే 8 గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి విద్యార్థులు కనీసం ఒక సబ్జెక్ట్‌ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో పిల్లలు నైపుణ్యాలను ఎంత నేర్చుకుంటున్నారు అనే దానిని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ కోర్సు ప్రస్తుతం మన పదో తరగతికి సమానం.   
  • ఇక 16 నుంచి 19 ఏళ్ల వయసున్న విద్యార్థులకు డిప్లొమా ప్రోగ్రామ్‌ (డీపీ) ఉంటుంది. మూడేళ్ల పాటు ఉండే ఈ ప్రోగ్రామ్‌లో లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్, లాంగ్వేజ్‌ అక్విజిషన్, సైన్స్, ఆర్ట్స్, మ్యాథ్స్, ఇండివిడ్యువల్స్‌ అండ్‌ సొసైటీస్‌ అనే 6 గ్రూపులు ఉంటాయి. డిప్లొమా ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత చివర్లో సరి్టఫికెట్‌ ప్రదానం చేస్తారు. మన ప్లస్‌ 2 విద్యకు సమానమైన ఈ డిప్లొమా సర్టిఫికెట్‌ ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలోనైనా చెల్లుతుంది.  
  • ఇదే వయసున్న (16–19 సం.) విద్యార్థుల కోసం కెరీర్‌ రిలేటెడ్‌ ప్రోగ్రామ్‌ (సీపీ) డిజైన్‌ చేశారు. ఇది విశ్వవిద్యాలయాలు, ఉపాధి, తదుపరి ట్రైనింగ్‌ కోసం విద్యార్థులను సిద్ధం చేసే రెండేళ్ల ప్రోగ్రామ్‌. విద్యార్థులు ఎంచుకున్న కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను, జ్ఞానాన్ని పెంపొందిస్తారు.  
Published date : 04 Dec 2023 10:39AM

Photo Stories