DELED Exam Fee: 30 లోగా డీఈఎల్‌ఈడీ పరీక్ష ఫీజు చెల్లించండి
Sakshi Education
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : త్వరలో నిర్వహించే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఈడీ) మూడో సెమిస్టర్ (2022–24 బ్యాచ్) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఫీజులు చెల్లించడానికి ఉద్దేశించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ విడుదల చేశారని డీఈఓ పీ శ్యామ్‌సుందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30 లోగా ఫీజులు చెల్లించవచ్చన్నారు. అభ్యర్థులు నాలుగు నుంచి ఆరు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు ఫిబ్రవరి 2వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
Published date : 24 Jan 2024 04:11PM