Skip to main content

Warangal Government Polytechnic College: నేటి నుంచి స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు

Warangal Government Polytechnic College

రామన్నపేట: వరంగల్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఆన్‌లైన్‌ అడ్మిషన్ల అనంతరం మిగిలిన సివిల్‌ ఇంజనీరింగ్‌ 12, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 47 సీట్ల స్పాట్‌ అడ్మిషన్‌కు మంగళవారం నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్‌ బైరి ప్రభాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం.. ఈనెల 28న సీట్లు కేటాయించనున్నట్లు వివరించారు. సీటు కోసం అప్‌లై చేసుకున్న విద్యార్థులు వారి ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజుతో ఈనెల 28న కళాశాలకు హాజరై అడ్మిషన్‌ పొందాలని సూచించారు. పాలిసెట్‌ పరీక్ష ఉత్తీర్ణులైన వారు లేదా పదోతరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 27లోపు వారి దరఖాస్తులు కళాశాలలో సమర్పించాలని సూచించారు.
 

Published date : 25 Jul 2023 08:05PM

Photo Stories