Skip to main content

TSRJC SET: టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ –2023కు దరఖాస్తుల ఆహ్వానం

ఎదులాపురం: 2022–23 పదో తరగతి విద్యార్థుల నుంచి టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌–2023కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ప్రణీత, ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ నీరడి గంగాధర్‌ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు.

తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్‌ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ ఆదేశాల మేరకు ఈ ప్రకటన విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశం పొందచ్చని, అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్ష మే 6వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రధాన కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ http://tsrjcdc.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాలకు 040–24734899 సంప్రదించాలని కోరారు.

Published date : 13 Apr 2023 06:31PM

Photo Stories