Innovation Challenge: ఇన్నోవేషన్ ఛాలెంజ్‌కు దరఖాస్తుల ఆహ్వనం
సాక్షి, చైన్నె: హెచ్‌సీఎల్ గ్లోబల్ సమ్మేళనం, అప్‌లింక్ ఆక్వా ప్రెన్యూర్, ఓఎన్ ఇన్నోవేషన్ ఫ్లాట్ ఫాం, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానించేందుకు తాజాగా నిర్ణయించాయి. జీరో వాటర్ వేస్ట్ నినాదంతో నీటి వినియోగ విధానాలకు పిలుపు నిస్తూ, సరఫరా, డిమాండ్, మంచి నీటి సంరక్షణ అంశాలపై ఈ ఛాలెంజ్ జరగనుంది. నీరు– పర్యావరణ వ్యవస్థపై దరఖాస్తులను అక్టోబరు 2వ తేదీ వరకు పూర్తి వివరాలతో దాఖలు చేయాల్సి ఉంది. ఇదే తేదిన ఛాలెంజ్ అర్హత ప్రమాణాల వివరాలను నిర్వాహకులు ప్రకటిస్తారు. అక్టోబరు 17 నుంచి నవంబర్ 15వ తేదీ వరకు పైన పేర్కొన్న అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలను సమీక్ష, ఎంపిక కార్యక్రమాలు ఉంటాయని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు తెలిపారు. ఈ ఛాలెంజ్ ఆధారంగా అప్ లింక్ ఇన్నోవేషన్‌లో చేరేందుకు టాప్ 10 దరఖాస్తుదారులను ఎంపిక చేయడమే కాకుండా, ప్రత్యేక ప్రోత్సహాలు అందించనున్నారు.