Skip to main content

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మూడు కొత్త మెడికల్ కాలేజీలకు ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్‌ తెలిపారు.
AP New Medical Colleges
AP New Medical Colleges

రాజ్యసభలో డిసెంబ‌ర్ 14వ తేదీన‌ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని చెప్పారు.

కొత్త కాలేజీలు ఇవే..
​ప్రధానమంత్రి స్వస్థ్య సురక్ష యోజన కింద తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌, విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీ, అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను అభివృద్ధికి కూడా ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. ఇవి కాకుండా పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నంలో కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

Published date : 14 Dec 2021 06:11PM

Photo Stories