Jagananna Vidya Deevena: విద్యా దీవెన మాకు వరం
మా తల్లిదండ్రులు వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. నన్ను బాగా చదివించి మంచి ఉద్యోగస్తుడిని చేయాలన్నది వారి కల. సున్నిపెంట జీఎంఆర్ కాలేజీలో పాలిటెక్నిక్ పూర్తి చేశాను. ఆతర్వాత అప్పులు చేసిమరి బీటెక్‌లో చేర్పాంచాలని అనుకున్నారు. ఏది ఏమైన కడపలోని కేఎస్‌ఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ బీటెక్‌లో ట్రిపుల్‌ఈలో సీటు వచ్చింది. 2019 నుంచి 2022 వరకు అక్కడే చదివాను. ఆ సమయంలో సీఎంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన విద్యా దీవెన పథకం నాకు వరంలా మారింది. ఎటువంటి ఫీజులు కట్టకుండానే బీటెక్ పూర్తి చేశా. ఇప్పుడు హైదారాబాద్‌లో హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాప్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. నెలకు రూ.40 వేలు వేతనం వస్తుంది. విద్యా దీవెన కింద సీఎం సహాయం చేయడంతోనే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించా. ఇప్పుడు మా కుటుంబ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. మానాన్నా అమ్మవాళ్లు చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి జగనన్నకు థ్యాంక్స్.
– గుండి నాగన్న, సాఫ్ట్‌వేర్ డెవలపర్, ముసలిమడుగు, కొత్తపల్లి మండలం
చదవండి: Rishi Sunak : మన విద్యార్థులు బ్రిటన్ వెళ్లాలనుకుంటే.. ఈ కొత్త రూల్స్ పాటించాల్సిందే..