Skip to main content

Degree Exams Postponed: ఏఎన్‌యూ డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు వాయిదా

ANU degree first year exams postponed    Additional Controller of Examination Department

ఒంగోలు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలో డిగ్రీ ప్రథమ సంవత్సరం పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం అదనపు కంట్రోలర్‌ రెడ్డి ప్రకాశరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవానికి మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉందని, కానీ రెగ్యులర్‌ మొదటి సెమిస్టర్‌ పరీక్షలను ఈనెల 27 నుంచి నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. మొదటి సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలు 2024 జనవరి 19వ తేదీన ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. అయితే ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే బీఎస్సీ, బీబీఏ తృతీయ సంవత్సరం 5వ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో ఎటువంటి మార్పు ఉండదన్నారు. కాలేజీల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

sakshi education whatsapp channel image link

Published date : 15 Dec 2023 05:29PM

Photo Stories