Skip to main content

Admissions in Gurukula School: గురుకులాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కారెంపూడి: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, కళాశాలల్లో జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 23వ తేదీ లోగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని కారెంపూడి గురుకులం ప్రిన్సిపాల్‌ వనపాల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.
Apply online from 25th January to 23rd February   Students applying online for admissions 5th Class in Gurukula School Junior Inter Admissions in Colleges   Admissions open for 5th class and junior inter

5వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరంలో వివిధ కోర్సులలో ప్రవేశాలకు కూడా దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారని, మార్చి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు 5వ తరగతి ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం 2 గంటల నుంచి 4.30 వరకు జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు దగ్గర్లో ఉన్న గురుకుల పాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

చదవండి: NMMS Exam: స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో 31లోపు నమోదు చేసుకోవాలి

Published date : 27 Jan 2024 09:55AM

Photo Stories