మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో 26వ ర్యాంకు
Sakshi Education
అమలాపురం రూరల్: అమలాపురం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన చీకట్ల వెంకట సంతోష్ జాతీయ స్థాయి మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చాటి 26వ ర్యాంకు సాధించాడు.
ఈ ఏడాది ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో పీజీలో ప్రవేశానికి పీజీ సెట్ 2023 నిర్వహించింది. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో సంతోష్ జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించాడు. ప్రధాన సెంట్రల్ యూనివర్సిటీలో ఎండీ జనరల్ మెడిసిన్ చేస్తానని సంతోష్ తెలిపారు. కొత్తపేటలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడిగా పనిచేస్తున్న డాక్టర్ చీకట్ల వెంకట నారాయణ కుమారుడైన సంతోష్ జాతీయ స్థాయిలో 26వ ర్యాంకు సాధించడం పలువురు అభినందనలు తెలిపారు. అమలాపురం శ్రీగౌతమ మహర్షి గోసంరక్షణ గోశాల నిర్వాహకుడు పోతురాజు రామకృష్ణారావు, ప్రతినిధులు చాగంటి వరప్రసాద్, నూకల ప్రసాద్, లింగోలు విస్సు, పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అతన్ని ఆదివారం అభినందించారు.
Published date : 12 Jun 2023 05:33PM