Skip to main content

NEET UG Question Paper With Key 2024 : నీట్-2024 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : నీట్ యూజీ 2024 (NEET UG) ప‌రీక్ష‌ను మే 5వ తేదీన‌(ఆదివారం) ఎన్‌టీఏ(NTA) దేశవ్యాప్తంగా నిర్వ‌హించింది. అయితే ఈ నీట్‌ప‌రీక్ష కొద్దిగా క‌ష్టంగా వ‌చ్చింద‌ని అంటున్నారు.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు.
Leading Subject Experts Describe NEET 2024 Exam as Challenging   NEET UG Question Paper With Key 2024  NEET UG 2024 Exam Date  NEET UG 2024 Conducted Nationwide by NTA

ఈ నేప‌థ్యంలో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులతో నీట్ యూజీ-2024 కీ ని ప్రిపేర్ చేయించింది. నీట్ యూజీ 2024 (NEET UG) కొశ్చ‌న్ పేప‌ర్ & కీ కోసం www.sakshieducation.comలో చూడొచ్చు. అయితే అంతిమంగా ఎన్‌టీఏ అధికారికంగా విడుద‌ల కీ మాత్ర‌మే మీరు ప్ర‌మాణికంగా తీసుకోండి.

దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2024 ప‌రీక్ష‌కు 24 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, ఏపీ నుంచి 70 వేలమంది ఈ పరీక్ష రాసినట్టు అంచనాలున్నాయి.దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల మంది నీట్ 2024 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు కాగా, 13 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఇక 24 మంది ధర్డ్ జెండర్ విద్యార్ధులున్నారు.

☛ NEET UG 2024 Question Paper Leak Update News : నీట్ 2024 పేపర్ లీక్ ..? ఆ కేంద్రంలో ఏమి జ‌రిగిందంటే..?

నీట్ యూజీ 2024 కొశ్చ‌న్‌పేప‌ర్‌లో.. ఫిజిక్స్‌ విభా­గంలో కఠినంగా వ‌చ్చిందంటున్నారు. అలాగే కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల్లో ప్రశ్నలు సులువుగా ఉన్నట్లు శ్రీ చైతన్య నీట్‌ కోచింగ్‌ నిపుణులు కె.రవీంద్ర కుమార్‌ వెల్లడించారు.
అయితే ఈసారి ర్యాంకులపై ఫిజిక్స్‌ ప్రభా­వం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బోటనీలో ఓ ప్రశ్న వివాదాస్పదంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈసారి కెమిస్ట్రీ విభాగంలో ప్రశ్నలు సులువుగా ఉన్నాయన్నారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల నుంచి నేరుగా, వాటి ఆధారంగా ఎక్కువ ప్రశ్నలు వచ్చాయని రవీంద్రకుమార్‌ తెలిపారు. మొత్తంగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రశ్నపత్రం కొంచెం కష్టంగా ఉందని వివరించారు. ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు సమాధానాలు గందరగోళంగా ఉన్నాయనీ, ఏ ఆప్షన్‌ కరెక్ట్‌ అనేదానిపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. 

NEET UG Question Paper With Key 2024 ఇదే..

Published date : 07 May 2024 11:10AM

Photo Stories