Skip to main content

NEET PG Mock Test: సాక్షి మీడియా గ్రూప్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు NEET-PG మాక్‌ టెస్ట్‌!

జనరల్‌ మెడిసిన్, రేడియాలజీ, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తాల్మాలజీ, సైకియాట్రీ, అనస్థీషియాలజీ మొదలైన స్పెషలైజేషన్లలో వారి భవిష్యత్‌ కెరీర్‌లకు పునాది వేయడానికి ఔత్సాహిక వైద్యులకు NEET-PG చాలా కీలకమైన పరీక్ష.
Prepare for NEET-PG with Sakshi Media Group  NEET PG Mock Test    Sakshi Media Group Mock Exam Announcement  Join Our Mock Exam for PG Medical Studies
NEET PG Mock Test

PG మెడికల్‌ స్టడీస్‌ ప్రాముఖ్యతను గుర్తిస్తూ, సాక్షి మీడియా గ్రూప్‌ జూన్‌ 16, 2024న...విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో NEET-PG మాక్‌ పరీక్షను నిర్వహిస్తోంది.

పరీక్షకు కొద్ది రోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్‌ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు.

ఈ మాక్‌ టెస్ట్‌ క్లినికల్‌ నాలెడ్జ్‌ మరియు ఎగ్జామ్‌–టేకింగ్‌ స్ట్రాటజీలను పదును పెట్టడంలో సహాయపడటమే కాకుండా, నిజమైన NEET-PG లో రాణించడానికి అభ్యర్థులు బాగా సన్నద్ధమయ్యారని నిర్ధారిస్తుంది. ఈ మాక్‌ పరీక్షకు MyRank టెక్నాలజీ పార్టనర్‌ గా వ్యవహరిస్తోంది. 

ఆసక్తి గల అభ్యర్థులు RS.500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి https://www.arenaone.in/mock/neetpg ద్వారా Onlineలో దరఖాస్తు చేసుకోవచ్చు. లాగిన్‌ హాల్‌ టికెట్‌ నెంబర్, పాస్వర్డ్‌ పరీక్షకు రెండు రోజుల ముందు మీరు రిజిస్టర్‌ చేసుకున్న ఈ–మెయిల్‌ ఐడి / ఫోన్‌ నెంబర్‌ కు మెసేజ్‌ వస్తుంది.

మాక్‌ పరీక్ష ఆన్‌లైన్‌లో https://sakshimocktest.myrank.co.inలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎప్పుడైనా లాగిన్‌ అయి పరీక్ష రాసుకోవచ్చు...  పరీక్ష సమయం మూడు గంటల 30 నిముషాలు. అలాగే పరీక్ష ముగిసిన వెంటనే మీ స్కోర్‌ను కూడా మీరు చూసుకోవచ్చు.  పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 99126 71555, 9666013544, 9666572244. 

 

Published date : 11 May 2024 10:10AM

Photo Stories