Skip to main content

Open School Exams: ఓపెన్‌స్కూల్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ములుగు: ఏప్రిల్ 25వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జరగనున్న ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్‌(రెవెన్యూ)సీహెచ్‌ మహేందర్‌జీ సూచించారు.
open school examinations

ఈ మేరకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఏప్రిల్ 16న‌ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం చేపట్టాల్సిన సౌకర్యాలపై సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్లకు అనుమతులు ఇవ్వకూడదన్నారు.

పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీ రెట్టింపు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 602 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు సహకరించాలని కోరారు.

చదవండి: Open Tenth and Inter: పకడ్బందీగా ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వాహణ.. తేదీ..?

దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. కేంద్రాల్లో ఎక్కడా విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైద్య సిబ్బంది తరఫున ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇతరత్రా మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరుగుతాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ పాణిని, ట్రాన్స్‌కో డివిజనల్‌ అధికారి నాగేశ్వర్‌రావు, ఇంటర్మీడియట్‌ అధికారి వెంకటేశ్వర్లు, టీఓఎస్‌ఎస్‌ అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ శంకర్‌రావు, ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి అప్పని జయదేవ్‌, ఆర్‌ఎస్సై కనకయ్య, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Published date : 17 Apr 2024 04:14PM

Photo Stories