Skip to main content

Good News for Junior Advocates: జూనియర్‌ అడ్వొకేట్లకు రూ.5 వేల స్టైపెండ్‌.. పదేళ్లకు పైగా ప్రాక్టీస్‌ ఉన్న న్యాయవాదులకు ఇవి..

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ న్యాయవాదులకు రూ.5 వేల స్టైపెండ్‌ ఇవ్వాలని హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏఏ) అధ్యక్షుడు ఎ.రవీందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
5 thousand stipend for junior advocates

రూ.10 లక్షల బీమా కూడా కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల బార్‌ అసోసియేషన్ల సమావేశం ఏప్రిల్ 28న‌ హెచ్‌సీఏఏ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లను వారు ప్రభుత్వానికి నివేదించారు.

చదవండి: Guidelines for Designation of Senior Advocates: న్యాయవాదుల హోదాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

పదేళ్లకు పైగా ప్రాక్టీస్‌ ఉన్న న్యాయవాదులకు ఇళ్లు, నేషనల్‌ లా స్కూళ్లలో స్థానికులకు రిజర్వేషన్లు.. తదితర డిమాండ్లపై ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించారు.

సమావేశంలో హెచ్‌సీఏఏ ఉపాధ్యక్షురాలు దీప్తి, కార్యదర్శులు శాంతిభూషణ్‌రావు, సంజీవ్‌రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Published date : 29 Apr 2024 11:20AM

Photo Stories