Skip to main content

TS LAWCET 2024 Application Date Extended: టీఎస్‌ లాసెట్‌-2024 పరీక్షల దరఖాస్తు గడువు పొడిగింపు

Legal education exams application deadline update   Ten day extension for LAW CET and PG LCET application  TS LAWCET 2024 Application Date Extended  Telangana legal education exams application extension

తెలంగాణలోని న్యాయ విద్య కోసం నిర్వహించే లాసెట్‌(LAW CET), పీజీ ఎల్‌ సెట్‌(PG LCET) పరీక్షలకు దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 15తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. అయితే అభ్యర్థుల కోరిక మేరకు ఎలాంటి ఆలస్యరుసుం లేకుండా మరో పదొ రోజుల పాటు దరఖాస్తు గడువును పొడిగించారు.

దీంతో అభ్యర్థులు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఇప్పటివరకు లాసెట్‌కు 18,615 దరఖాస్తులు,పీజీ లాసెట్‌కు మొత్తం 26,570 దరఖాస్తులు వచ్చినట్లు సెట్‌ కన్వీనర్‌  బీ విజయలక్ష్మి తెలిపారు. సాధ్యమైనంత వరకు అభ్యర్థులు త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది (ఆలస్య రుసుం లేకుండా): 25.04.2024

పరీక్ష తేదీ: 03.06..2024
వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/

Published date : 16 Apr 2024 12:08PM

Photo Stories