Skip to main content

SCCL: ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాలు

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో శుక్రవారం నుంచి 18 ఏళ్లలోపు పిల్ల లకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభిస్తున్నట్లు ఏరియా జీఎం ఎం.శాలేంరాజు తెలిపారు.
Free summer training camps

సింగరేణి ఉద్యోగుల పిల్లల(బాలురు, బాలికలు)తో పాటు కొత్తగూడెం పరిసర ప్రాంత పిల్లలు కూడా హాజరుకావొచ్చని పేర్కొన్నారు.

చదవండి: Sreeja Akula: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి నంబర్ వన్!

రామవరంలోని సాధన గ్రౌండ్‌లో ఫుట్‌బాల్, రుద్రంపూర్‌లోని సీఈఆర్‌ క్లబ్, కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వాలీబాల్, రుద్రంపూర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ మైదానంలో అథ్లెటిక్స్, హాకీ, 3 ఇంక్లైన్‌లోని రెస్క్యూ మైదానంలో కిక్‌ బాక్సింగ్‌ శిక్షణ శిబిరాలు ఉంటాయని జీఎం వెల్లడించారు.  

Published date : 26 Apr 2024 05:19PM

Photo Stories