Skip to main content

Group 1 Exam: ఆఫ్‌లైన్‌లో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను ఆఫ్‌లైన్‌లో ఓఎంఆర్‌ ఆధారంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ప్రకటించింది.
Telangana State Public Service Commission  Group 1 Prelims Exam Online  TSPSC Group-1 Preliminary Exam Announcement

వివిధ ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్‌–1 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టైప్‌)ను జూన్‌ 9న నిర్వహించనున్నట్లు ఇప్పటికే కమిషన్‌ వెల్లడించింది.

తాజాగా ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్‌ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ ఏప్రిల్ 1న‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమేరకు సన్నద్ధం కావాలని సూచించారు. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్

Published date : 02 May 2024 03:41PM

Photo Stories