వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో అన్యాయం.. నోటిఫికేషన్ సవరనకు వినతి!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరుగుతోందని ఇంటర్ వొకేషనల్ డెయిరీ కోర్సు ఉత్తీర్ణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈనెల 21న టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో తమకు అర్హత కల్పించకపోవడం భావ్యం కాదని వారంటున్నారు.
2013లో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తమతో పాటు ఎంపీవీఏ కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులేనని వారు చెబుతున్నారు. ఈ జీవో ప్రకారమే 2017 లో నోటిఫికేషన్ నం: 30/17 జారీ చేసి వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేశారు. ఈ నోటిఫికేషన్‌లో తమకు కూడా అవకాశం కల్పించారని, కానీ తాజా నోటిఫికేషన్ నం: 06/2020 ప్రకారం తమకు అవకాశం కల్పించడం లేదని తెలంగాణ వొకేషనల్ డెయిరీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. నోటిఫికేషన్ సవరించి తమకు కూడా అర్హత కల్పించాలని అసోసియేషన్ నేతలు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు.
Published date : 27 Jul 2020 01:10PM