జూన్ 4 నుంచి నాలుగోవిడత ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్..కావాల్సిన పత్రాలు ఇవే
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: లాంగ్వేజ్ పండిట్-తెలుగు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ తెలుగు మీడియం పోస్టులకు సంబంధించి నాలుగో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను కరోనా కారణంగా జూన్ 4 నుంచి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
వెరిఫికేషన్‌కు ఎంపికై న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు వెబ్‌ఆప్షన్ డాక్యుమెంట్, హాల్‌టికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ప్రొవిజినల్ లేదా మార్కుల మెమో (డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్), 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, కులధ్రువీకరణ పత్రం, బీసీ అభ్యర్థులు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, దివ్యాంగ అభ్యర్థులు సదరం సర్టిఫికెట్, ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్ ఎన్‌వోసీ, ఏజెన్సీ ఏరియా, ఎస్టీ అభ్యర్థులు ఏజెన్సీ సర్టిఫికెట్లను, గెజిటెడ్ ఆఫీసర్ సంతకంతో రెండు సెట్లపై సంతకం చేయించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలకు అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
Published date : 03 Jun 2020 05:21PM