జీవవైవిధ్యం - ప్రవాళ భిత్తికలు
Sakshi Education
ప్రవాళ భిత్తికలు విస్తృత జీవవైవిధ్యానికి నిలయాలు. అందువల్ల వీటిని సముద్రాల వర్షపాత అడవులుగా అభివర్ణిస్తారు. తక్కువ లోతున్న సముద్ర ప్రాంతాల్లో ఒక రకమైన జీవుల నుంచి వెలువడే కాల్షియం కార్బొనేట్ స్రావాలు గట్టిపడటం ద్వారా ఈ భూస్వరూపాలు ఏర్పడతాయి. ప్రవాళ భిత్తికలతో సహజీవనం చేసే జ్యూక్సాంతల్ జీవులు ప్రవాళాలకు వివిధ రంగులనిస్తాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ జీవులు క్రమంగా నశించడంతో ప్రవాళ జీవులు పొడబారి తెల్లగా మారి, క్రమంగా నశిస్తున్నాయి.
ఆయనరేఖా ప్రాంతంలోని సముద్ర భూతలాలపై కనిపించే విశేష భూస్వరూపాలే ప్రవాళ భిత్తికలు. సాధారణంగా సముద్రాల్లో తక్కువ లోతు ప్రదేశాల్లో కొన్ని ప్రవాళ జీవులు నివసిస్తుంటాయి. వీటి శరీరాలు కాల్షియం కార్బొనేట్ పదార్థంతో నిర్మితమై ఉంటాయి. ప్రత్యేక తరగతికి చెందిన ఈ జీవులను ‘పాలిప్స్’గా వ్యవహరిస్తారు. స్టొమాటో పొరాయిడ్స్, మెలస్కస్ తదితర జాతుల జీవులు పాలిప్స్‌కు చెందుతాయి. వీటి శరీర భాగాలే కాకుండా కవచాలు, స్రావాలు కూడా కాల్షియం కార్బొనేటుతో కూడి ఉంటాయి.
ఈ ప్రవాళ జీవులు అనువైన ప్రాంతాల్లో సహనివేశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో ప్రవాళ జీవుల శరీర భాగాలు, స్రావాలు, కవచాలు పెద్ద దిబ్బల మాదిరిగా ఉండి ప్రవాళ భిత్తికలుగా ఏర్పడతాయి. ఈ ప్రవాళ భిత్తికలు లంబదిశలో విస్తరించి, సముద్ర మట్టంపైకి తేలినప్పుడు ప్రవాళ జీవులుగా ఏర్పడతాయి. ప్రవాళ భిత్తికలు.. జ్యూప్లాంక్టన్, ఫైటా ప్లాంకన్లకు ఆలవాలంగా ఉంటాయి.
ప్రవాళ జీవులకు అనువైన పరిస్థితులు

- 21°C సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత
- తక్కువ లోతు ఉన్న సముద్ర భాగాలు
- పారదర్శకంగా ఉండే సముద్ర భాగాలు
- శిథిల శిలా పదార్థం లేని సముద్ర భాగాలు
- సముద్ర అంతర్గత వేదికలు
ఈ అనువైన పరిస్థితులు 30° ఉత్తర-దక్షిణ అక్షాంశ ప్రాంతాల్లోని తక్కువ లోతు ఉన్న సముద్ర భాగాల్లో ఉంటాయి. అందువల్ల ప్రవాళ భిత్తికలు ప్రధానంగా ఆయనరేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతాల్లోని హిందూ మహాసముద్రం, కరేబియన్ సముద్రం, నైరుతి పసిఫిక్ సముద్ర ప్రాంతాలు, నైరుతి అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. లక్షదీవులు, ఫిజీ, టాంగా, కరేబియన్ దీవులు, తూర్పు ఆస్ట్రేలియూ తీరాల్లో ప్రవాళ దీవులు విస్తరించి ఉన్నాయి. నదీ ముఖద్వారాల వద్ద సముద్ర జలాలు శిలాపదార్థ నిక్షేపణం వల్ల పారదర్శకంగా ఉండవు. కాబట్టి అక్కడ భిత్తికలు ఏర్పడవు.
ప్రవాళ భిత్తికలు ప్రధానంగా మూడు రకాలు. అవి.. 1) తీరాంచల భిత్తికలు, 2)అవరోధ భిత్తికలు, 3) అటాల్స్.
ఈ మూడు రకాల భిత్తికలు మూడు అభివృద్ధి దశలను సూచిస్తాయని నిపుణుల అభిప్రాయం. ఈ మూడు రకాలు వరుసగా వాటి పరిణామక్రమంలో ఏర్పడతాయని ‘డార్విన్-డానా’లు సూత్రీకరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రవాళ భిత్తికలు ప్రాథమిక దశలో అగ్నిపర్వత దీవుల తీరాల్లో తీరాంచల భిత్తికల రూపంలో ఏర్పడతాయి. దీవి క్రమంగా కుంగిపోవడంతో తీరానికి, ప్రవాళ భిత్తికకు మధ్య ‘కయ్య’ ఏర్పడుతుంది. ఈ రకంగా తీరాంచల భిత్తిక, అవరోధ భిత్తికగా మారుతుంది. అగ్నిపర్వత దీవి పూర్తిగా కుంగిపోవటంతో మధ్య భాగంలో విశాలమైన కయ్య రూపొందుతుంది. ఈ రకంగా కయ్యను పరివేష్టించి ఉన్న వృత్తాకార ప్రవాళ భిత్తికను ‘అటాల్’గా పిలుస్తారు. అయితే అగ్నిపర్వత దీవుల ప్రాంతాల్లో ‘భూ అభినతి’ సంభవించడానికి కారణాలను డార్విన్ సిద్ధాంతం వివరించలేకపోరుయింది.
ప్లీస్టోసిన్ హిమనీ నదాలు కరగటం వల్ల క్రమంగా తీరాంచల భిత్తికలు అటాల్స్గా మారాయని రీన్-ముర్రే సూత్రీకరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్లీస్టోసిన్ హిమనీ నదాలతో మూసుకుపోయిన ఖండాల తీరాల్లో మొదటగా తీరాంచల భిత్తికలు ఏర్పడ్డాయి. కవోష్ణ యుగంలో హిమానీనదాలు క్రమంగా కరగడంతో భిత్తికలకు, తీరానికి మధ్య కయ్య ఏర్పడుతుంది. దీంతో తీరాంచల భిత్తికలు అవరోధ భిత్తికలుగా, క్రమంగా అటాల్గా రూపొందుతాయి. తీరాంచల భిత్తికల్లోని కాల్షియం కార్బొనేటు ద్రావణీకరణం చెందడంతో క్రమక్షయం చెంది, ఆ ప్రాంతంలో కయ్య ఏర్పడుతుంది. తద్వార అవరోధ భిత్తికలు ఏర్పడతాయని ద్రవణీకరణ సిద్ధాంతం తెలుపుతోంది.
అటాల్స్.. అంతటా ఒకే రీతి
అటాల్స్లోని కయ్యల లోతు ప్రపంచవ్యాప్తంగా ఒకేరీతిలో ఉండటాన్ని హిమనీనద నియంత్రణ సిద్ధాంతం వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాల కరిగే రేటు ఒకేరకంగా ఉంటుంది. దీంతో వాటివల్ల ఏర్పడిన కయ్యల లోతు ఒకేరీతిగా ఉంటుంది.
ప్రవాళ క్షీణత
1870ల నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రవాళ భిత్తికా మండలాల్లో ప్రవాళ క్షీణత జరిగినట్లు ఆధారాలున్నాయి. అయితే 1970 నుంచి ప్రవాళ క్షీణత తీవ్రత అధికంగా ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. మొత్తం 105కి పైగా సామూహిక ప్రవాళ క్షీణత సంఘటనలు జరిగినట్లు సమాచారం. అందులో 60 సంఘటనలు 1979-1990 మధ్యలోనే సంభవించాయి. 1980లకు పూర్వం ప్రవాళ క్షీణత ప్రధానంగా చక్రవాతాలు, వేలా తరంగాల వల్ల సంభవించింది. కానీ 1980ల తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగటం వల్ల ప్రవాళ క్షీణత జరిగినట్లు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2°C నుంచి 3°C అధికంగాపెరిగితే ప్రవాళ క్షీణత ప్రారంభమవుతుంది.
ప్రవాళం క్షీణించినప్పటికీ క్షీణత చాలావరకు తాత్కాలికంగా ఉంటుంది. కానీ 1998, 2002లలో సంభవించిన ప్రవాళ క్షీణత శాశ్వతమని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. 1998, 2002లలో ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని గ్రేట్ బారియర్ రీఫ్లో 40 శాతం క్షీణత సంభవించింది. లక్షదీవులు, మాల్దీవులు, శ్రీలంక, కెన్యా, టాంజానియా, సెబెల్స్ ప్రాంతాల్లోని ప్రవాళ భిత్తికలలో కూడా భారీ స్థాయిలో క్షీణత జరిగింది. మధ్యధరా సముద్రంలో ‘విబ్రియో షిలోయి’ అనే సూక్ష్మజీవి ‘ఓక్యులినా పటగోనికా’ తరగతికి చెందిన ప్రవాళ భిత్తికలను క్షీణింపజేస్తున్నట్లు నిపుణులు తెలిపారు. భారతదేశం, శ్రీలంకల మధ్య ఉన్న మన్నార్ సింధుశాఖ, పాక్ అఖాతం ప్రాంతాల్లో రామేశ్వరం దీవి నుంచి వేధాలయి వరకు 25 కిలోమీటర్ల ప్రాంతంలో 66 జాతులకు చెందిన ప్రవాళ జీవులు నివసిస్తున్నాయి. పోరైట్స్ జాతికి చెందిన ప్రవాళాల్లో క్షీణత కనిష్టంగా 29 శాతం ఉంది. గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీ ప్రవాళ క్షీణతను అరికట్టడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నిరంతరం గమనించడం.. క్షీణతను ముందుగానే పసిగట్టడం.. క్షీణతా తీవ్రతను అంచనా వేయడం.. క్షీణత వల్ల సంభవించే ఆవరణ సమస్యలను మదింపు చేయడం. స్థానికులను ప్రవాళ పరిరక్షణలో భాగస్వాములను చేయడం మొదలైనవి ప్రణాళిక ముఖ్యాంశాలు.

ప్రపంచ వర్షపాతం.. విస్తరణ!
బాష్పీభవన ప్రక్రియ ద్వారా భూ ఉపరితల జలరాశుల నుంచి వాతావరణంలోకి చేరిన నీటిఆవిరి సంతృప్తం చెందినప్పుడు చల్లారి, ద్రవీభవించి.. వర్షపాతం రూపంలో తిరిగి భూఉపరితలంపైకి చేరుతుంది.
ప్రపంచ వర్షపాత విస్తరణల్లో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆవిర్భావ ప్రక్రియను అనుసరించి.. మూడు రకాల వర్షపాతాన్ని గుర్తించొచ్చు.. 1) పర్వతీయ వర్షపాతం, 2) సంవహన వర్షపాతం, 3) చక్రవాత వర్షపాతం.
పర్వతీయ వర్షపాతం: పెద్ద మొత్తాల్లో నీటిఆవిరితో కూడిన ఆర్థ్ర పవనాలు.. సముద్రాల నుంచి ఖండ భాగాల పైకి వీచినపుడు ఎత్తయిన పర్వత శ్రేణులు వాటిని అడ్డగించడం వల్ల పర్వతాల పవనాభిముఖ దిశలో సంభవించే వర్షపాతాన్ని ‘పర్వతీయ వర్షపాతం’ అంటారు. ఆర్ధ్రతతో కూడిన పవనాలు పర్వతాలను దాటే ప్రయత్నంలో పైకి లేస్తాయి. ఈ ప్రక్రియలో అవి వ్యాకోచం చెందడంతో వాటిలోని నీటిఆవిరి చల్లారి, ద్రవీభవించి వర్షిస్తాయి. ఈ పవనాలు పర్వతాలను దాటాకా పవన పరాన్ముఖ దిశలో వర్షాన్నివ్వవు. అందువల్ల పవన పరాన్ముఖదిశలో వర్షచ్ఛాయ ప్రాంతాలు ఏర్పడతాయి. ఉదాహరణకు రుతుపవనాలు భారతదేశ పశ్చిమ తీరాన్ని తాకినప్పుడు సహ్యాద్రి కొండలు వాటిని అడ్డగిస్తాయి.
వర్షచ్ఛాయ ప్రాంతాలు: అరేబియూ సముద్రం నుంచి వీచే ఆర్ధ్ర నైరుతి రుతుపవనాలు సహ్యాద్రి కొండలను దాటే ప్రయత్నంలో వ్యాకోచించి, చల్లారి, ద్రవీభవించి పశ్చిమ తీరమైదానంలో విస్తారంగా వర్షాన్నిస్తాయి. సహ్యాద్రి కొండల పవన పరాన్ముఖ దిశలోని దక్కన్ పీఠభూమికి చెందిన ఉత్తర కర్ణాటక, రాయలసీమ, పశ్చిమ తెలంగాణ, మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాలు వర్షచ్ఛాయ ప్రాంతాలుగా మారాయి. ఈ ప్రాంతాలు కేవలం 4060 సెం.మీ.ల వార్షిక సగటు వర్షపాతంతో పాక్షిక శుష్క మండలాలుగా మారాయి.
సంవహన వర్షపాతం: భూమధ్యరేఖా ప్రాంతంలో సంభవించే వర్షపాతం ‘సంవహన వర్షపాతం’ తరగతికి చెందుతుంది. భూమధ్యరేఖకు ఇరువైపులా ఉన్న 5° దక్షిణ - 10° ఉత్తర అక్షాంశాల మధ్య ప్రాంతంలో ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీనివల్ల ఈ ప్రాంతంలో భూ ఉపరితలాన్ని ఆనుకొని ఉన్న వాయువులు వేడెక్కి సంవహన ప్రక్రియ వల్ల ఉత్థానం చెందుతాయి. ఎత్తుకు చేరిన తర్వాత ఈ సంవహన వాయువులు వ్యాకోచించి, చల్లారి ద్రవీభవించి వర్షాన్నిస్తాయి.
బ్రెజిల్‌లోని అమెజాన్, ఆఫ్రికాలోని కాంగో(జైర్) బేసిన్లలో సంవహన వర్షపాతం ఉంటుంది. దీని వల్ల ఏడాది పొడవునా ప్రతి రోజు మధ్యాహ్న సమయంలో వర్షం కురుస్తుంది. దేశంలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో గాలిదుమ్ములతోపాటుగా కురిసే జల్లులు కూడా సంవహన వర్షపాత రకానికే చెందుతాయి. ఆయనరేఖా, మధ్య అక్షాంశ ప్రాంతాల్లోని చక్రవాత మండలాల్లో కురిసే వర్షపాతం.. చక్రవాత వర్షపాత రకానికి చెందుతుంది. ఆయన రేఖా సముద్రాల్లో ఏర్పడే అల్పపీడనా ద్రోణులు బలపడి, క్రమంగా వాయుగుండాలుగా, తుపాన్లుగా మారి ఖండాల తీరాన్ని తాకినప్పుడు విస్తారంగా వర్షం కురుస్తుంది. మధ్య అక్షాంశాల్లోని సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో కవోష్ణ పశ్చిమ పవనాలు, ధ్రువప్రాంత తూర్పు పవనాలు అభిసరణం చెందినప్పుడు ఏర్పడే వాతాగ్ర మండలంలో చక్రవాతాలేర్పడి, విస్తారంగా వర్షం కురుస్తుంది. చక్రవాత వర్షపాతం, బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడి ఉంటుంది.
వర్షపాత విస్తరణ: ప్రపంచ వర్షపాత విస్తరణలో అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయి. భారతదేశంలోని మాసిన్రాం, చిరపుంజీ లాంటి ప్రాంతాల్లో అత్యధికంగా సుమారు 1000 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతోంది. అటకామా ఎడారిలోని సాలెరస్ ప్రాంతంలో కొన్ని సందర్భాల్లో వరుసగా అయిదేళ్లపాటు కనీసం ఒక చుక్క వర్షం కూడా కురవలేదు.
వార్షిక సగటు వర్షపాతం ప్రాతిపదికన ప్రపంచాన్ని 3 అవపాత మండలాలుగా విభజించొచ్చు.
1. అధిక వర్షపాత మండలం (100 సెం.మీ.ల కంటే అధిక వార్షిక సగటు వర్షపాతం)
2. మధ్యస్థ వర్షపాత మండలం (30 నుంచి 100 సెం.మీ. వార్షిక సగటు వర్షపాతం)
3. అల్ప వర్షపాత మండలం (30 సెం.మీ.ల కంటే తక్కువ వార్షిక సగటు వర్షపాతం).
భూమధ్యరేఖా ప్రాంతంలో: భూమధ్యరేఖా ప్రాంతంలో ఏడాది పొడవునా అధిక ఉష్ణోగ్రతలు ఉండటం వల్ల సంవత్సరమంతా సంవహన వర్షపాతం ఉంటుంది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌కు చెందిన అమెజాన్, ఆఫ్రికాలోని కాంగో(జైర్) బేసిన్లు ఈ మండలానికి చెందుతాయి. ఈ మండలంలో వార్షిక సగటు వర్షపాతం 250 సెం.మీ.కు పైగా ఉంటుంది. ప్రతి నెలా కనీసం 6 సెం.మీ. సగటు వర్షపాతం నమోదవుతుంది. ఈ మండలంలో ఆయనరేఖా సతతహరిత అరణ్యాలు పెరుగుతాయి. ఆయనరేఖ, ఉప ఆయనరేఖా ప్రాంతాల్లో ఈశాన్య, ఆగ్నేయ వ్యాపార పవనాలు సముద్రాల నుంచి వీస్తూ, మొదటగా ఖండాల తూర్పుభాగాల్లో ప్రవేశిస్తాయి. వీటి ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు బ్రెజిల్, కరేబియన్ దీవులు, మధ్య అమెరికా, ఆగ్నేయ అమెరికా, మడగాస్కర్ తూర్పు తీరం, తూర్పు ఆఫ్రికా తీరం ఈ మండలానికి చెందుతాయి. దక్షిణ, ఆగ్నేయాసియాల్లో రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షం కురుస్తుంది.
భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, వియత్నాం, కంబోడియూ తదితర దేశాలు రుతుపవన మండలం కిందకు వస్తాయి. అధిక వర్షపాతం కారణంగా ఈ మండలంలో దట్టమైన రుతుపవన అరణ్యాలు పెరుగుతున్నాయి. 40°-60° అక్షాంశ ప్రాంతాల్లో ఖండాల పశ్చిమ భాగాల్లో పశ్చిమ పవనాల ప్రభావం వల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయి. పశ్చిమ పవనాలు ఈ ప్రాంతాల్లోకి వాతాగ్ర(కవోష్ణ) చక్రవాతాలను చోదితం చేయడం కూడా అధిక వర్షపాతానికి కారణం. వాయవ్య అమెరికా, వాయవ్య ఐరోపాలు ఈ మండలం కిందకు వస్తాయి. ఆయనరేఖ, ఉప ఆయనరేఖా అక్షాంశాల్లోని ఖండాల పశ్చిమ భాగాల్లో ఉష్ణమండల ఎడారులు ఏర్పడ్డాయి. ఉదాహరణకు సహారా, అరేబియా, మొజావే, పశ్చిమ ఆస్ట్రేలియా, థార్, అటకామా ఎడారులు. అదేవిధంగా మధ్య అక్షాంశాల్లోని ఖండాంతర్భాగాల్లో కూడా శీతల ఎడారులు ఏర్పడ్డాయి. ఉదాహరణకు గోబీ, పెటగోనియా ఎడారులు. శీతల, ఉష్ణమండల ఎడారులతోపాటు ధ్రువ, ఉప ధ్రువ ప్రాంతాల్లో అత్యల్ప వర్షపాతం సంభవిస్తుంది. ఖండాంతర్భాగాలు సముద్రాలకు దూరంగా ఉండటం వల్ల ఇక్కడ వీచే పవనాలు శుష్కంగా ఉంటాయి. అందువల్ల వర్షపాతం అత్యల్పంగా ఉంటుంది. ఆయనరేఖా ప్రాంతాల్లోని ఖండాల పశ్చిమ భాగాల్లో... ఉష్ణమండల ఎడారులు ఏర్పడటానికి వాటి తీరాల్లో ప్రవహించే శీతల సముద్ర ప్రవాహాలు కూడా కొంతవరకు కారణం.

Published date : 27 Oct 2015 01:15PM