TSLPRB: తుది పరీక్షకు టీఎస్‌ఎల్పీఆర్బీ సన్నద్ధం
వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలు జనవరి 5న ముగిశాయి. ప్రాథమిక రాతపరీక్షలో ఉత్తీర్ణత సాధించినవారిలో దాదాపు 54 శాతం మంది దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించినట్టు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. పూర్తి స్థాయిలో సాంకేతికత ఉపయోగించి నిర్వహించిన ఈ ఫిజికల్ ఈవెంట్లలో పొరపాట్లకు తావులేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
ఇప్పటికే మార్చి 12 నుంచి తుది రాతపరీక్షలు నిర్వహించనున్నట్టు షెడ్యూల్ సైతం టీఎస్‌ఎల్పీఆర్బీ వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు తగినట్టుగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల తుది రాత పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రధానంగా చాలా విభాగాల్లో పోస్టులకు హైదరాబాద్‌లోనే పరీక్షాకేంద్రాలు ఏర్పా టు చేయనుండగా, పెద్దసంఖ్యలో అభ్యర్థులు పా ల్గొనే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించేందుకు బోర్డు అధికారులు సిద్ధమవుతున్నారు.