TSLPRB: ఎస్సై తుదిపరీక్ష ‘కీ’పై అభ్యంతరాలకు గడువు తేదీ ఇదే..
ప్రాథమిక ‘కీ’లో ఏవైనా అభ్యంతరాలుంటే అభ్యర్థులు బోర్డుకు తెలియజేసేందుకు ఇచ్చిన గడువు ఏప్రిల్ 16న సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. ప్రాథమిక ‘కీ’లోని జవాబులు, ప్రశ్నలకు ఇచ్చి ఐచ్చికాలలో ఏవైనా తప్పుగా ఉన్నా తెలియజేసేందుకు టెంప్లెట్లలో ఫార్మెట్‌ను సైతం బోర్డు అధికారులు పోలీస్ నియామక మండలి వెబ్‌సైట్ (www.tslprb.in)లో సూచించారు. అభ్యంతరం ఉన్న ప్రతి ప్రశ్నకు సూచించిన విధానంలో వేర్వేరుగా అభ్యంతరాలు పంపాల్సి ఉంటుంది.
చదవండి: TSLPRB: ఎస్సై తుది రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ విడుదల.. ‘కీ’ కోసం క్లిక్ చెయండి
కాగా, సివిల్ ఎస్సై, కమ్యూనికేషన్ ఎస్సై, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్సై పోస్టులకు మొత్తం 62,342 మంది అభ్యర్థులకుగాను 59,534 మంది అభ్యర్థులు తుది రాతపరీక్షకు హాజరైన విషయం తెలిసిందే. అభ్యర్థుల నుంచి ప్రిలిమినరీ ‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత వాటిని విశ్లేషించి, అందులో పరిశీలనకు అర్హమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది ‘కీ’ని రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు.
చదవండి: Indian History Bitbank in Telugu: వందేమాతరం గేయాన్ని మొదట ఏ భాషలో రాశారు?