కమ్యూనికేషన్ ఎస్‌ఐ తుదిరాత పరీక్ష తేదీ ఇదే..
ఐటీ, కమ్యూనికేషన్ ఎస్‌ఐ, ఫింగర్‌ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐ పోస్టులకు తుదిరాత పరీక్ష మార్చి 11న నిర్వహించనున్నట్టు టీఎస్‌ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఐటీ, కమ్యూనికేషన్ ఎస్‌ఐ అభ్యర్థులకు, మధ్యాహ్నం 2–30 గంటల నుంచి 5–30 గంటల వరకు ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్‌ఐలకు తుది రాతపరీక్ష నిర్వహించనున్నారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 6న ఉదయం 8 గంటల నుంచి మార్చి 9 అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్లను టీఎస్‌ఎల్పీఆర్బీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని చైర్మన్ సూచించారు.
చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | వియస్ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్
హాల్‌టికెట్‌పై పాస్‌పోర్ట్ ఫొటో తప్పనిసరి
తుది రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఏ4 కాగితంపై రెండు వైపుల వచ్చేలా హాల్‌టికెట్ ప్రింటవుట్ తీసుకోవాలని సూచించారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై సూచించిన ప్రాంతంలో పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోను అతికించాలని తెలిపారు. ఫొటోకు పిన్‌లు కొట్టకూడదని పేర్కొన్నారు. ఫొటో అంటించకుండా హాల్‌టికెట్‌తో వచ్చే అభ్యర్థులను పరీక్షకు అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు.