Skip to main content

SI Exam: ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష తేదీ మార్పు?

తెలంగాణ‌ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరగనున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎస్‌ఐ) ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీ మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
police
ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష తేదీ మార్పు?

మే 26తో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ముందుగా సబ్‌ఇన్‌స్పెక్టర్, దానికి సమానహోదా కలిగిన వివిధ విభాగాల పోస్టులకు ఆగస్టు 7న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు ప్రాథమికంగా నిర్ణయిం చారు. అయితే ఇదేరోజు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో జరుగు తున్న బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ అసిస్టెంట్‌ కమాండెంట్ల పరీక్ష కూడా ఉంది. 253 అసిస్టెంట్‌ కమాండెంట్ల పోస్టులకు హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్‌ఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారిలో కొందరు అసిస్టెంట్‌ కమాండెంట్ల పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారని, దీంతో ఒకేరోజు రెండు పరీక్షలు రాయడం వీలుపడనందున ఎస్‌ఐ పరీక్ష తేదీని మార్చాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దీనిపై బోర్డు అధికారులు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. 

చదవండి:

తెలంగాణ పోలీసు ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి 

​​​​​తెలంగాణ ఎస్ఐ,కానిస్టేబుల్ ప‌రీక్ష‌ల బిట్‌బ్యాంక్ కోసం క్లిక్ చేయండి

Published date : 31 May 2022 04:13PM

Photo Stories