Skip to main content

TSLPRB: ‘ఆ అభ్యర్థులకు’ మరో అవకాశం

సాక్షి, హైదరాబాద్‌ : యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాల భర్తీలో భాగంగా అభ్యర్థులకు నిర్వహించిన ఎత్తు కొలతల్లో ఒక సెంటీమీటర్, అంతకంటే తక్కువ తేడాతో అనర్హులైన అభ్యర్థులకు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో అవకాశం కల్పించనుంది.
TSLPRB
‘ఆ అభ్యర్థులకు’ మరో అవకాశం

ఒక సెంటీమీటర్, ఆ లోపు తేడాతో అనర్హులైన అభ్యర్థులకు మరోమారు ఎత్తు కొలతలు తీయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్‌ఎల్పిఆర్బీ చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ఫిబ్రవరి 8న ఓ ప్రకటనలో తెలిపారు. ఎత్తు కొలతలో పాల్గొనాలనుకునే అర్హులైన అభ్యర్థులు www.tslprb.in వెబ్‌సైట్‌ ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు లాగిన్‌ ఐడీల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి: TS పోలీస్ - గైడెన్స్ | స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | మోడల్ పేపర్స్ | ఆన్ లైన్ టెస్ట్స్ | వీడియోస్ | AP పోలీస్

హైదరాబాద్‌లోని ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌ అంబర్‌పేట్, 8వ బెటాలియన్‌ కొండాపూర్‌లలో ఈ ఎత్తు కొలతలను తీయనున్నట్లు వెల్లడించారు. భౌతిక కొలతలకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను తీసుకురావాల్సి ఉంటుందని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయకుండా వినతిపత్రాలు రాసి తెచ్చే వారిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు.

Also Read: TS POLICE - GUIDANCE | STUDY MATERIAL | BITBANK | SYLLABUS | PREVIOUS PAPERS | MODEL PAPERS | ONLINE TESTS | AP POLICE

Published date : 09 Feb 2023 01:34PM

Photo Stories