Skip to main content

TSLPRB: కానిస్టేబుల్‌ పరీక్షకు 98% హాజరు!.. ’కీ’ కోసం క్లిక్‌ చేయండి

సాక్షి, హైదరాబాద్‌: వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 30న నిర్వహించిన తుది రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
TSLPRB
కానిస్టేబుల్‌ పరీక్షకు 98% హాజరు!.. ’కీ’ కోసం క్లిక్‌ చేయండి

అన్ని పోస్టులకు కలిపి మొత్తం 98శాతం మంది అభ్యర్థులు తుది రాత పరీక్షకు హాజరైనట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ వివి శ్రీనివాసరావు ఏప్రిల్‌ 30న ఓ ప్రకటనలో తెలిపారు.  మొత్తం 183 పరీక్ష కేంద్రాల్లో తుది రాత పరీక్ష నిర్వహించారు. సివిల్‌ కానిస్టేబుల్‌ తత్సమాన పోస్టులకు 1,09,663 మంది అభ్యర్థులుగాను 1,08,055 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

➤ TS Constable Final Exam-2023 Question Paper with Key

ఐటీ, కమ్యూనికేషన్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు 6,801 మంది అభ్యర్థులకు గాను 6,088 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా తుది రాత పరీక్ష నిర్వహించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులందరికీ బయోమెట్రిక్‌ విధానంలో హాజరు తీసుకున్నట్టు తెలిపారు. కానిస్టేబుల్‌ తుది రాత పరీక్షల ప్రిలిమినరీ కీను అతి త్వరలోనే రిక్రూట్మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని చైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

Published date : 02 May 2023 01:32PM

Photo Stories