తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ సబ్జెక్టు సిలబస్‌లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది.
ఇంటర్ సెకండియర్ సిలబస్‌లో మార్పులు
ఇంటర్ రెండో సంవత్సరానికి 2022 నుంచి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలు అందించనుంది. New Syllabusతో ముద్రించిన పుస్తకాలు త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. ఇటీవల ఇంగ్లిష్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ స్పష్టం చేశారు. కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి. కరుణ విడుదల చేశారు.