Inter Exams: పరీక్షలకు సర్వం సిద్ధం.. పరీక్షల విషయంలో ఏమైనా సందేహాలుంటే వీరిని సంప్రదించాలి
పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఫిబ్రవరి 21న ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొదటి సంవత్సరం 10,200 మంది, ద్వితీయ సంవత్సరం 9,277 మంది విద్యార్థులు హాజరవుతారని చెప్పారు. అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
16 పోలీస్‌స్టేషన్లలో ప్రశ్నపత్రాలు భద్రపరిచామని, 36 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది శాఖాపరమైన అధికారులు, 13 మంది అదనపు పర్యవేక్షకులు విధులు నిర్వహిస్తారని వివరించారు. మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లు, ఐదు కస్టోడియన్స్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
550 మంది ఇన్విజిలేటర్లకు విధులు కేటాయించామని చెప్పారు. పరీక్షల సమయంలో ఆయా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఆశాఖ అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ తయారు చేయాలని ఇంటర్మీడియట్ అధికారి సులోచనారాణికి సూచించారు.
విద్యార్థులు పరీక్షల విషయంలో ఏమైనా సందేహాలుంటే జూనియర్ అసిస్టెంట్లు బి.బిక్షం(9704661714), ఇ.శివకుమార్ (9346913069)ను సంప్రదించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్, డీఎంహెచ్‌ఓ శిరీష, డీఈఓ వెంకటేశ్వరాచారి, విద్యుత్ అధికారులు వెంకటరత్నం, ప్రభాకర్‌రావు, కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ విజయబాబు, మున్సిపల్ కమిషనర్లు శేషు, మురళి పాల్గొన్నారు.