Skip to main content

TS Inter Results 2022 : జూన్ 28వ తేదీన ఇంటర్‌ ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణ‌లో ఇంటర్‌ ఫస్ట్, సెకండియర్‌ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ స్పష్టత నిచ్చింది.

జూన్ 28వ తేదీన(మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల‌ను విడుదల చేయ‌నున్నారు. ఇంటర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్‌బోర్డు జూన్ 26వ తేదీ (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది. ఫ‌లితాలు విడుద‌ల చేసిన 15 రోజుల్లోనే ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వ‌హింస్తామ‌ని ఇంట‌ర్ బోర్డ్ కార్య‌ద‌ర్శి జ‌లీల్ గ‌తంలోనే ప్ర‌క‌టించారు. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

How to Check TS Inter 1st Year 2022 Results:Results

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 1st year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

How to Check TS Inter 2nd Year 2022 Results:

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 2nd year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

ఈ సార ఫ‌లితాల కోసం 9,07,396 మంది విద్యార్థులు..
ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. అలాగే ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌కు 4,64,626 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

ఈ సారి 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే..
గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

తెలంగాణ 2022–23 ఇంట‌ర్‌ విద్యా సంవత్సర క్యాలెండర్‌..Inter Exams

ఇంటర్మీడియట్‌ 2022–23 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను తెలంగాణ ఇంట‌ర్‌ బోర్డు మే 16న విడుదల చేసిన విష‌యం తెల్సిందే. జూన్ 15న ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. ఫస్టియర్ క్లాసులు జూలై 1 నుంచి మొదలవుతాయని, 2023 మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుందని తెలిపింది. జూన్ నుంచి మార్చి వరకూ మొత్తం 304 దినాలుంటే, ఇందులో 83 సాధారణ, సంక్రాంతి, దసరా సెలవులు ఉంటాయని, ఇంటర్ కాలేజీలు 221 పనిదినాలు కొనసాగుతాయని షెడ్యూల్లో వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ షెడ్యూల్ను అనుసరించాలని బోర్డు పేర్కొంది.

Also Check:What after Inter/10+2...

2022–23 అకడమిక్ క్యాలెండర్ ఇదే..

సెకండియర్‌ మొదలు

15–6–22

ఫస్టియర్‌ ప్రారంభం

01–7–22

దసరా సెలవులు

2–10–22 నుంచి 9–10–22 వరకు

అర్ధ సంవత్సర పరీక్షలు

21–11–22 నుంచి 26–11–22 వరకు

సంక్రాంతి సెలవులు

13–1–23 నుంచి 15–1–23 వరకు

ప్రీ ఫైనల్‌ పరీక్షలు

6–2–23 నుంచి 13–2–23 వరకు

ప్రాక్టికల్‌ పరీక్షలు

20–2–23 నుంచి 6–3–23 వరరకు

థియరీ పరీక్షలు

15–3–23 నుంచి 4–4–23 వరకు

కాలేజీల చివరి పనిదినం

31–3–23

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

2023 మే చివరి వారం

కాలేజీల పునఃప్రారంభం

1–6–23

Published date : 26 Jun 2022 10:25PM

Photo Stories