Tenth Class: చాయిస్ తగ్గింది.. ప్రశ్నల స్థాయి మించింది..
Sakshi Education
‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ..
- టెన్త్ పరీక్షల్లో గతంలో ఇచ్చింనట్టుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం.
- వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు.
- పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు.
- సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచాలి
ప్రశ్నపత్రంలో జవాబుల చాయిస్ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి.
– రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్‌ఎంల సంఘం అధ్యక్షుడు
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
Published date : 02 Jan 2023 02:54PM