Skip to main content

English Language: ఆంగ్లంపై పట్టు.. ఉన్నతికి మెట్టు

నిర్మల్‌ఖిల్లా: పాఠశాల విద్య అనంతరం అత్యంత కీలకమైన దశ ఇంటర్మీడియట్‌. ఈదశలో విద్యార్థిలో భాషాపరిజ్ఞానం పెంపొందిస్తే జీవితంలో అన్నిరకాల పోటీ పరీక్షలను విజయవంతంగా ఎదుర్కోగలుగుతాడు.
English Language

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించడంలో భాగంగా ఆంగ్లభాష పరిజ్ఞానం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ప్రస్తుతం ఏ ఉద్యోగాన్ని పొందాలన్నా, ఏ పోటీ పరీక్ష రాయాలన్నా ఆంగ్లభాష కీలకం. ఇదివరకు ఇంటర్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌ కెమిస్ట్రీలకు మాత్రమే పరిమితమైన ప్రాక్టికల్స్‌ ఇక ఇంగ్లిష్‌ భాషకు సైతం ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టింది. ఈనెల 16న(నేడే) జిల్లావ్యాప్తంగా 7,020 మంది విద్యార్థులు ఈ ప్రాక్టికల్‌ పరీక్షకు హాజరుకానున్నారు. ఇందులో 5,814 జనరల్‌ విద్యార్థులు,1,206 ఒకేషనల్‌ విద్యార్థులు ఉన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

ప్రాక్టికల్స్‌ మార్కులు ఇలా..

ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు ప్రాక్టికల్స్‌కు 20 మార్కులను కేటాయించారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికి నాలుగు మార్కులు కేటా యించారు. అదేవిధంగా రికార్డుకు కూడా నాలుగు మార్కులు కేటాయించారు. వీటిలో నాలుగు అంశాలు ఉంటాయి.

కమ్యూనికేటివ్‌ ఫంక్షన్‌కు నాలుగు మార్కులు, జస్ట్‌ ఏ మినిట్‌(జామ్‌)కు నాలుగు మార్కులు, రోల్‌ ప్లే(పాత్ర పోషణ) నాలుగు మార్కులు, లిజనింగ్‌ కాంప్రహెన్షన్‌కు నాలు గు మార్కులు, రికార్డు నోటుపుస్తకానికి నాలుగు మార్కులు మొత్తం 20 మార్కులు ఈ ప్రాక్టికల్స్‌కు కేటాయించారు. ఈ 20 మార్కుల్లో విద్యార్థి కనీసం ఏడు మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ విధంగా థియరీ పరీక్షకు 80 మార్కులు వీటికి 20 మార్కులు ప్రాక్టికల్స్‌ కలుపుకుని మొత్తం 100 మార్కులు ఉండనున్నాయి.

ఆంగ్ల భాషకున్న ప్రాధాన్యంతోనే...

ప్రస్తుతం ఆంగ్ల భాషకు ఉన్న ప్రాధాన్యతతోనే ఈ సబ్జెక్టుకు ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెట్టినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇంగ్లిష్‌ భాషపై సరైన పట్టు లేకపోవడం ఉన్నతస్థాయిలో అన్ని ఆంగ్లమాధ్యమంలోనే ఉండడంతో ఆంగ్లభాషపై విద్యార్థులు భయాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం ఆంగ్ల భాషకు ప్రాక్టికల్స్‌ ప్రవేశపెట్టడంతో రోజువారీ తరగతులకు అదనంగా, వారానికి ఒక గంటపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేవిధంగా చదవడం, రాయడం, మాట్లాడడం సాఫ్ట్‌స్కిల్స్‌ వంటి నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించారు. ఈ మేరకు బోధనా అంశాలపై ఇంగ్లిష్‌ భాషను బోధించే అధ్యాపకులకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా శిక్షణను కూడా అందించారు.

ప్రాక్టికల్‌ మార్కుల వివరాలు..

అంశం నిర్వహణ మార్కులు విధానం

కమ్యూనికేటివ్‌ ఫంక్షనింగ్‌ మౌఖిక: 4
జస్ట్‌ ఏ మినిట్‌(జామ్‌) మౌఖిక: 4
పాత్రపోషణ(రోల్‌ ప్లే) మౌఖిక: 4
లిజనింగ్‌ కాంప్రెహెన్షన్‌ రాత: 4
ప్రాక్టికల్‌ రికార్డ్‌ రాత: 4

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచేందుకు..

ఇంగ్లిష్‌ భాషకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇంగ్లిష్‌ భాష కీలకం. ఈ భాషలో విద్యార్థులు పట్టు సాధించే విధంగా ఇంటర్‌ స్థాయినుంచే భాషలో నైపుణ్యాలు పెంపొందించాలని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది.
– కె.నవీన్‌, అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, లోకేశ్వరం

సామర్థ్యాలు పెంపొందుతాయి...

ఇంటర్‌ విద్యార్థులకు ఆంగ్ల భాష నైపుణ్యాలు పెంపొందించే విధంగా ఇంటర్‌ బోర్డు ప్రాక్టికల్స్‌ ప్రవేశపెట్టారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో ప్రాక్టికల్స్‌ను 16న నిర్వహిస్తాం. 20 మార్కులకు నిర్వహించే ఈ ప్రాక్టికల్స్‌ ఐదు విభాగాల్లో ఉంటాయి. దీనివల్ల విద్యార్థుల్లో భాష సామర్థ్యాలు పెంపొందుతాయి.
– జాదవ్‌ పరశురాం, జిల్లా ఇంటర్‌విద్యాశాఖాధికారి, నిర్మల్‌ జిల్లా

Published date : 16 Feb 2024 03:24PM

Photo Stories