Women IPS Journey: ప్రజలకు సేవ చేయాలనే ఆశతో ఐపీఎస్ లో విజయం
మా స్వస్థలం హరియాణా. నాన్న ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో పనిచేశారు. ఆయన ఉద్యోగరీత్యా నా చదువంతా వివిధ ప్రాంతాల్లో సాగింది. ఇంటర్ జమ్మూకశ్మీర్‌లో చదివిన నేను ఢిల్లీలోని కమలానెహ్రూ కళాశాలలో జర్నలిజం చేశాను. అక్కడ ఉండగానే సివిల్స్‌పై దృష్టి సారించా. ప్రజలకు సేవ చేసేందుకు అదే మంచి మార్గమనిపించింది. 2021లో తొలుత కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్(సీడీఎస్) పరీక్షకు హాజరయ్యాను. అఖిల భారత స్థాయిలో 6వ ర్యాంకు సాధించా.
➤ Lawyer to IPS Journey: న్యాయవాది నుంచి ఐపీఎస్ గా విజయం.. ఎలా..?
అలాగని సివిల్స్‌ని వదిలేయలేదు. పట్టుదలగా చదివేదాన్ని. కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో యూపీఎస్సీ టాపర్ల వీడియోలను చూస్తూ, ప్రణాళికను రూపొందించుకున్నా. అలా అనుకున్న దారిలో వెళ్ళుతూనే పరీక్షలు రాసి, తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాను. 2021లో వెలువడిన సివిల్స్ ఫలితాల్లో 172వ ర్యాంకుతో ఐపీఎస్‌కు ఎంపికయ్యా. గుజరాత్ కేడర్ ఐపీఎస్‌గా అక్కడి పోలీసింగ్‌లో సమర్థురాలిగా పేరు తెచ్చుకోవాలనేదే నా ఉద్దేశం. అంతర్గత భద్రత అంశాలైన నక్సలిజం, తీరప్రాంత