యూజీ అబ్రాడ్ కు సరైన మార్గం..!
Sakshi Education
విదేశీ విద్య అనగానే సాధారణంగా గుర్తొచ్చేది.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులే! అయితే ప్రస్తుతం ఇంటర్మీడియెట్ అర్హతతోనూ విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోఉన్నాయి.
విద్యార్థులు ‘బ్రాడ్’గా ఆలోచిస్తే.. ఇంటర్ అర్హతతోనే ‘అబ్రాడ్’ స్టడీస్ అవకాశాన్ని చేజిక్కించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా స్టడీ అబ్రాడ్ బ్యాచిలర్ డిగ్రీ మార్గాల సమగ్ర సమాచారం..
స్టడీ అబ్రాడ్ అనగానే టక్కున గుర్తొచ్చే దేశం.. అమెరికా! అయితే ఇప్పుడు అమెరికాతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు విదేశీ విద్యార్థులకు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
బీటెక్, బీఎస్ :
యూజీ స్టడీ అబ్రాడ్ కోణంలో అధిక శాతం మంది బీటెక్/బీఈ, బీఎస్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్) కోర్సులపై దృష్టిసారిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం.. ఆయా కోర్సులు కెరీర్ ఓరియెంటెడ్‌గా ఉండటం, అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే విదేశాల్లో అడుగుపెడితే అక్కడే పీజీ, పీహెచ్‌డీ వంటి కోర్సుల్లో సులభంగా ప్రవేశాలు పొందొచ్చనే అభిప్రాయం నెలకొనడం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. విదేశాల్లో యూజీ పూర్తిచేసినవారు అక్కడే పీజీ కోర్సులను చదవాలంటే జీఆర్‌ఈ, జీమ్యాట్ వంటి టెస్ట్ స్కోర్లు తప్పనిసరి.
అవసరమైన స్కోర్లు..
అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో టెక్నికల్, సైన్స్ కోర్సుల్లో ప్రవేశించాలంటే విద్యార్థులు ప్రధానంగా రెండు స్టాండర్డ్ టెస్టుల్లో నిర్దిష్ట స్కోరు సాధించాల్సి ఉంటుంది. అవి.. స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్), అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ). వాస్తవానికి ఇవి రెండూ అమెరికాలోని యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించినవి. అయితే అనేక దేశాలు ఈ టెస్టు స్కోర్‌లను ప్రామాణికంగా తీసుకుని ప్రవేశాలు కల్పిస్తున్నాయి. అదేవిధంగా ఇంటర్ వరకు ఉన్న అకడమిక్ ట్రాక్ రికార్డ్ ఆధారంగా పలు దేశాల్లోని యూనివర్సిటీలు ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా యూనివర్సిటీలు ప్రత్యేక ప్రవేశ ప్రక్రియను అనుసరిస్తున్నాయి.
శాట్ పరీక్ష విధానం :
అమెరికా విద్యాసంస్థలు సహా ప్రపంచంలోని దాదాపు ఏడువేల ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్, బీఎస్ వంటి స్టెమ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షే స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (శాట్). దీని స్కోరు ఆధారంగా టాప్ విదేశీ యూనివర్సిటీల్లో అడుగుపెట్టొచ్చు.
రెండు విభాగాలకు కలిపి 1600 పాయింట్లు (స్కోరు) పేర్కొన్నారు. ఇందులో 800 పాయింట్లు మ్యాథమెటిక్స్‌కు కేటాయించారు. శాట్‌లో 1300 పాయింట్లు(స్కోరు) పొందితే టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు రెండు విభాగాలకు వేర్వేరుగా నిర్దిష్ట స్కోరింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో విభాగంలో 620-650 స్కోరు పొందేలా కృషి చేయడం లాభిస్తుంది.
సబ్జెక్ట్ టెస్టులు :
ఏసీటీతోనూ అవకాశాలు..
అమెరికానే ఏకైక గమ్యంగా నిర్దేశించుకున్న వారికి అందుబాటులో ఉన్న పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ). ఏసీటీ స్కోరు ఆధారంగా అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లోనే ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షలో నాలుగు విభాగాలు (ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్) ఉంటాయి. అభ్యర్థులు అదనంగా ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్స్..
శాట్, ఏసీటీ స్కోర్ల ఆధారంగా ప్రస్తుతం విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విదేశీ విద్య అంటే డాలర్లతో కూడుకున్న పని. ఈ క్రమంలో అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ స్థాయిని బట్టి ఏడాదికి 10-20 వేల డాలర్లు ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే శాట్, ఏసీటీ స్కోర్ల ఆధారంగా ఫుల్‌బ్రైట్ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్; రోటరీ ఇంటర్నేషనల్ అంబాసిడిరియల్ స్కాలర్‌షిప్స్; జేఎన్ టాటా ఎండోమెంట్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు ఆర్థిక ప్రోత్సాహకంగా లభిస్తుంది. అంతేకాకుండా.. ఎ-స్టార్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్స్, ఇన్‌సీడ్ స్కాలర్‌షిప్స్, టోఫెల్ స్కాలర్‌షిప్స్, ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్స్ వంటి పథకాల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవాలి.
ఇతర దేశాల్లోనూ అవకాశం :
శాట్, ఏసీటీ ద్వారా అమెరికా వెలుపలి దేశాల్లోనూ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు (బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ తదితర) అభ్యసించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అమెరికాతోపాటు కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ప్రముఖంగా నిలుస్తున్నాయి.
యూకే ప్రత్యేకం :
యూకే యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీలు ఉమ్మడి కౌన్సెలింగ్ పద్ధతిలో యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) ను ఏర్పాటు చేసుకున్నాయి. ఔత్సాహికులు దీనిద్వారా ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ దరఖాస్తులను పరిశీలించి మెరిట్ జాబితా రూపొందిస్తుంది. దీని ఆధారంగా యూనివర్సిటీలను కేటాయిస్తారు. భారతీయ విద్యార్థులకు యూకేలో ఉన్నతవిద్య కోణంలో కలిసొచ్చే మరో అంశం.. స్కాలర్‌షిప్స్. చార్లెస్ వాలేస్ ఇండియా ట్రస్ట్ అవార్డ్స్ అండ్ ఫెలోషిప్స్, కామన్వెల్త్ స్కాలర్‌షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్, బ్రెండిష్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థుల అకడమిక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకొని వీటిని కేటాయిస్తారు.
ఫీజులు..
సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ ఫీజులు ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల్లో ఏడాదికి 20 వేల డాలర్ల వరకు ఉంటోంది. ప్రైవేటు వర్సిటీల్లో స్థాయిని బట్టి 15 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్ల వరకు ఉంటుంది. నాన్-టెక్నికల్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ విభాగాలకు సంబంధించిన ఫీజులు 15-20 శాతం మేర తక్కువగా ఉంటున్నాయి.
ఉత్తమ కోర్సులు..
విద్యార్థులు అత్యుత్తమ కోర్సుల గురించి అన్వేషించడం సహజం. ఈ క్రమంలో విభాగాలు, దేశాల వారీగా క్రేజీ కోర్సుల వివరాలు...
అమెరికా: ఇంజనీరింగ్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజియోథెరపీ, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్.
యూకే: హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, ఐటీ, లా, మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా.
ఆస్ట్రేలియా: అగ్రికల్చర్ సెన్సైస్, ప్లాంట్‌సైన్స్, ఏవియేషన్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, హెల్త్‌కేర్.
కెనడా: కంప్యూటర్ సైన్స్, అప్లయిడ్ సెన్సైస్, హాస్పిటాలిటీ సర్వీసెస్, మేనేజ్‌మెంట్, ఏవియేషన్.
సింగపూర్: మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, లైఫ్ సెన్సైస్, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఫైనాన్స్.
విభాగాల వారీ క్రేజీ కోర్సులు..
ఇంజనీరింగ్: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్.
సైన్స్: బయలాజికల్ సెన్సైస్, ఆస్ట్రానమీ, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్.
కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్: అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్.
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్: ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, లాంగ్వేజ్ లిటరేచర్.
దరఖాస్తుకు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు :
విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు..

- స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ పరీక్ష రెండు విభాగాల్లో జరుగుతుంది. అవి.. ఎవిడెన్స్ బేస్డ్ రీడింగ్ అండ్ రైటింగ్; మ్యాథమెటిక్స్.
విభాగం
ప్రశ్నలు
సమయం
రీడింగ్
52
65 నిమిషాలు
రైటింగ్
44
35 నిమిషాలు
మ్యాథమెటిక్స్
58
80 నిమిషాలు
- మొత్తం మూడు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షకు అదనంగా 50 నిమిషాల వ్యవధిలో వ్యాస రచన ఉంటుంది. అయితే దీనికి హాజరయ్యే విషయంలో అభ్యర్థికి ఛాయిస్ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ విభాగానికి హాజరవ్వొచ్చు.
రెండు విభాగాలకు కలిపి 1600 పాయింట్లు (స్కోరు) పేర్కొన్నారు. ఇందులో 800 పాయింట్లు మ్యాథమెటిక్స్‌కు కేటాయించారు. శాట్‌లో 1300 పాయింట్లు(స్కోరు) పొందితే టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు రెండు విభాగాలకు వేర్వేరుగా నిర్దిష్ట స్కోరింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాయి. ఈ క్రమంలో ఒక్కో విభాగంలో 620-650 స్కోరు పొందేలా కృషి చేయడం లాభిస్తుంది.
సబ్జెక్ట్ టెస్టులు :
- స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో భాగంగా సబ్జెక్టు టెస్టులు కూడా ఉంటాయి. అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీలో ఎంపికచేసుకోనున్న కోర్సు ఆధారంగా సంబంధిత సబ్జెక్టు టెస్టులకు హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైన్స్, బయాలజీ తదితర సబ్జెక్టుల్లో వీటిని నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్జెక్టు టెస్టుకు గరిష్టంగా 800 పాయింట్లు కేటాయించారు.
- శాట్‌ను ఏటా ఆరుసార్లు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఈ పరీక్షలు జనవరి, మే, జూన్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతాయి. అత్యుత్తమ స్కోరును సొంతం చేసుకోవడానికి ఏడాదిలో ఎన్నిసార్లయినా శాట్‌కు హాజరుకావొచ్చు.
ఏసీటీతోనూ అవకాశాలు..
అమెరికానే ఏకైక గమ్యంగా నిర్దేశించుకున్న వారికి అందుబాటులో ఉన్న పరీక్ష.. అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ (ఏసీటీ). ఏసీటీ స్కోరు ఆధారంగా అమెరికాలోని ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లోనే ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షలో నాలుగు విభాగాలు (ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, రీడింగ్ ఎబిలిటీ, సైన్స్) ఉంటాయి. అభ్యర్థులు అదనంగా ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది.
స్కాలర్‌షిప్స్..
శాట్, ఏసీటీ స్కోర్ల ఆధారంగా ప్రస్తుతం విద్యార్థులకు పలు స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా విదేశీ విద్య అంటే డాలర్లతో కూడుకున్న పని. ఈ క్రమంలో అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్ స్థాయిని బట్టి ఏడాదికి 10-20 వేల డాలర్లు ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే శాట్, ఏసీటీ స్కోర్ల ఆధారంగా ఫుల్‌బ్రైట్ ఫారెన్ స్టూడెంట్ ప్రోగ్రామ్; రోటరీ ఇంటర్నేషనల్ అంబాసిడిరియల్ స్కాలర్‌షిప్స్; జేఎన్ టాటా ఎండోమెంట్‌లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా అభ్యర్థులకు ట్యూషన్ ఫీజు ఆర్థిక ప్రోత్సాహకంగా లభిస్తుంది. అంతేకాకుండా.. ఎ-స్టార్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్స్, ఇన్‌సీడ్ స్కాలర్‌షిప్స్, టోఫెల్ స్కాలర్‌షిప్స్, ఐఈఎల్‌టీఎస్ స్కాలర్‌షిప్స్ వంటి పథకాల రూపంలో ఆర్థిక ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఔత్సాహికులు ఉపయోగించుకోవాలి.
ఇతర దేశాల్లోనూ అవకాశం :
శాట్, ఏసీటీ ద్వారా అమెరికా వెలుపలి దేశాల్లోనూ బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు (బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లిబరల్ ఆర్ట్స్ తదితర) అభ్యసించే అవకాశం ఉంది. ఈ క్రమంలో అమెరికాతోపాటు కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాలు ప్రముఖంగా నిలుస్తున్నాయి.
యూకే ప్రత్యేకం :
యూకే యూనివర్సిటీల్లో యూజీ కోర్సుల ప్రవేశ ప్రక్రియ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ యూనివర్సిటీలు ఉమ్మడి కౌన్సెలింగ్ పద్ధతిలో యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అడ్మిషన్స్ సర్వీస్ (యూసీఏఎస్) ను ఏర్పాటు చేసుకున్నాయి. ఔత్సాహికులు దీనిద్వారా ఇన్‌స్టిట్యూట్‌లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ దరఖాస్తులను పరిశీలించి మెరిట్ జాబితా రూపొందిస్తుంది. దీని ఆధారంగా యూనివర్సిటీలను కేటాయిస్తారు. భారతీయ విద్యార్థులకు యూకేలో ఉన్నతవిద్య కోణంలో కలిసొచ్చే మరో అంశం.. స్కాలర్‌షిప్స్. చార్లెస్ వాలేస్ ఇండియా ట్రస్ట్ అవార్డ్స్ అండ్ ఫెలోషిప్స్, కామన్వెల్త్ స్కాలర్‌షిప్ అండ్ ఫెలోషిప్ ప్లాన్, బ్రెండిష్ ఫ్యామిలీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్ వంటివి అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థుల అకడమిక్ రికార్డ్‌ను పరిగణనలోకి తీసుకొని వీటిని కేటాయిస్తారు.
ఫీజులు..
సాధారణంగా బ్యాచిలర్ డిగ్రీ ఫీజులు ప్రభుత్వ పరిధిలోని యూనివర్సిటీల్లో ఏడాదికి 20 వేల డాలర్ల వరకు ఉంటోంది. ప్రైవేటు వర్సిటీల్లో స్థాయిని బట్టి 15 వేల డాలర్ల నుంచి 40 వేల డాలర్ల వరకు ఉంటుంది. నాన్-టెక్నికల్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ విభాగాలకు సంబంధించిన ఫీజులు 15-20 శాతం మేర తక్కువగా ఉంటున్నాయి.
ఉత్తమ కోర్సులు..
విద్యార్థులు అత్యుత్తమ కోర్సుల గురించి అన్వేషించడం సహజం. ఈ క్రమంలో విభాగాలు, దేశాల వారీగా క్రేజీ కోర్సుల వివరాలు...
అమెరికా: ఇంజనీరింగ్, సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజియోథెరపీ, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్.
యూకే: హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, ఐటీ, లా, మాస్ కమ్యూనికేషన్ అండ్ మీడియా.
ఆస్ట్రేలియా: అగ్రికల్చర్ సెన్సైస్, ప్లాంట్‌సైన్స్, ఏవియేషన్, ఎడ్యుకేషన్ అండ్ టీచింగ్, హెల్త్‌కేర్.
కెనడా: కంప్యూటర్ సైన్స్, అప్లయిడ్ సెన్సైస్, హాస్పిటాలిటీ సర్వీసెస్, మేనేజ్‌మెంట్, ఏవియేషన్.
సింగపూర్: మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ హాస్పిటాలిటీ, లైఫ్ సెన్సైస్, లాజిస్టిక్స్, ఏవియేషన్, ఫైనాన్స్.
విభాగాల వారీ క్రేజీ కోర్సులు..
ఇంజనీరింగ్: కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్.
సైన్స్: బయలాజికల్ సెన్సైస్, ఆస్ట్రానమీ, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్.
కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్: అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, హెచ్‌ఆర్‌ఎం, బిజినెస్ మేనేజ్‌మెంట్ అండ్ ఫైనాన్స్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్.
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్: ఆంత్రోపాలజీ, ఆర్కియాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, లాంగ్వేజ్ లిటరేచర్.
- భారత్ నుంచి వెళ్తున్న విద్యార్థుల్లో 80 శాతం మంది బీటెక్, బీఎస్ కోర్సుల్లోనే చేరుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మిగిలిన విద్యార్థులు మెడికల్ సెన్సైస్, లా కోర్సుకు ప్రాధాన్యమిస్తున్నారు.
దరఖాస్తుకు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు :
విదేశాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన పత్రాలు..
- కవరింగ్ లెటర్
- అప్లికేషన్ ఫీజు
- అప్లికేషన్ ఫామ్
- ఎస్సే
- ట్రాన్స్‌క్రిప్ట్స్
- రికమండేషన్ లెటర్స్
- మార్క్‌షీట్లు, సర్టిఫికెట్లు.
- బ్యాంక్ స్టేట్‌మెంట్.
- స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌వోపీ).
- ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ అఫిడవిట్.
- ఆయా టెస్టు స్కోరుల రిపోర్టు కార్డులు.
Published date : 04 Apr 2019 06:54PM