అమెరికా కలల సాకారానికి సరైన మార్గం...ఓపీటీ విధానం !
Sakshi Education
అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగం.. భారతీయ విద్యార్థులు.. ముఖ్యంగా
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది విద్యార్థుల లక్ష్యం! ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసుకుంటున్న చాలామందికి యూఎస్‌లో ఉన్నత విద్య.. తర్వాత అక్కడే ఉద్యోగం.. ఆపై హెచ్-1బి సొంతం చేసుకోవాలనే
ఆశ!! అలాంటి విద్యార్థులకు.. చక్కటి అవకాశం కల్పిస్తోంది.. ‘ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)’ విధానం! కాని ట్రంప్ వచ్చాక రోజురోజుకీ వీసా నిబంధనలు కఠినమవుతున్న సంగతి తెలిసిందే! మరోవైపు రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు ఇటీవల ఓపీటీ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించడంతో... ఓపీటీ మరోమారు చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో.. భారతీయ విద్యార్థుల అమెరికా కలల సాకారానికి మార్గంగా నిలుస్తున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) విధానంపై విశ్లేషణ...
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ).. అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు, కోర్సు పూర్తి చేసుకున్న వారు.. నిర్దేశిత కాలం పాటు అక్కడి సంస్థల్లో పని చేసేందుకు మార్గం! హెచ్-1బీ వీసాకు మార్గం వేసే ఓపీటీ ద్వారా ఏటా ఎంతోమంది విదేశీ విద్యార్ధులు ముఖ్యంగా భారతీయులు ప్రయోజనం పొందుతున్నారు. అలాంటి ఓపీటీని రద్దు చేయాలని కోరుతూ.. బిల్లు ప్రవేశ పెట్టనున్నట్లు రిపబ్లికన్ పార్టీకి చెందిన పాల్ గోసర్ ఇటీవల ప్రకటించారు. ఫెయిర్‌నెస్ ఫర్ హై స్కిల్డ్ అమెరికన్స్ యాక్ట్ ఆఫ్ 2019 పేరిట సదరు బిల్లును సభ ముందుకు తేనున్నట్లు చెప్పారు.
ఓపీటీ అంటే ?
అమెరికాలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు చదువుతున్న లేదా పూర్తి చేసుకున్న విద్యార్థులు.. తమ కోర్సుకు సంబంధించిన రంగంలో తాత్కాలిక పద్ధతితో నిర్దేశిత వ్యవధిలో ఆయా సంస్థల్లో పని చేసే అవకాశం కల్పించే విధానమే.. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ). ఉదాహరణకు మేనేజ్‌మెంట్ కోర్సుల విద్యార్థులు అమెరికాలోని సంస్థల్లో మేనేజీరియల్ విభాగంలో ఓపీటీ విధానంలో పని చేసే అవకాశం లభిస్తుంది. ఓపీటీ విధానంలో పని చేయాలంటే.. తప్పనిసరిగా కనీసం ఏడాది వ్యవధి గల కోర్సులు అభ్యసించాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ఆమోదం లభిస్తే..
ఓపీటీలు.. రెండు రకాలు :
ముందుగానే దరఖాస్తు :
మెరుగైన పనితీరుతో హెచ్-1బి వీసా :
ఓటీపీ సమయంలో చక్కటి పనితీరు కనబరిస్తే.. హెచ్-1బీ వీసా పొందే అవకాశం ఉంటుంది. అధిక శాతం సంస్థలు ఓటీపీ అభ్యర్థుల తరఫున పిటిషన్లు దాఖలు చేస్తున్నట్లు యూఎస్ ఇమిగ్రేషన్ వర్గాల సమాచారం. ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. స్టెమ్ విభాగంలో నైపుణ్యాలున్న స్థానిక యువత లభించకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. హెచ్-1బీకి పిటిషన్ దాఖలైతే అలాంటి అభ్యర్థులు ఓపీటీ ముగిసిన సమయానికి హెచ్-1బీ వీసా మంజూరుకు మధ్య ఉన్న వ్యవధిలో అమెరికాలోనే నివసించేందుకు అనుమతి లభిస్తుంది. ఈ విషయంలో క్యాప్ గ్యాప్ అనే విధానం అమలవుతోంది. అంటే.. ప్రతిఏటా హెచ్-1బీ పిటిషన్ల మంజూరు ఏప్రిల్1న జరుగుతుంది. వాటిని పొందిన అభ్యర్థులు అక్టోబర్1 నుంచి విధుల్లో చేరే వీలుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఏప్రిల్1 కంటే ముందే ఓపీటీ పూర్తి చేసుకొని హెచ్-1బీ పిటిషన్‌కు అవకాశం పొందినా.. అక్టోబర్1 వరకు పని చేసే అవకాశం ఉండదు. ఈ సమయంలో అభ్యర్థులు స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఎఫ్-1 టు హెచ్1.. కఠినంగా!
ఓపీటీ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్-1బి వీసా మంజూరుకు ట్రంప్ సర్కారు క్లిష్టమైన నిబంధనల దిశగా అడుగులు వేస్తోంది. భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీపై మరింత కఠిన వైఖరి తీసుకుంటోంది. ప్రతి ఏటా మంజూరు చేసే హెచ్-1బీ వీసాల్లో 15 శాతం మాత్రమే భారతీయులకు ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ప్రతిఏటా లాటరీ విధానంలో 65 వేల హెచ్-1బి వీసాలు, అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారి కోసం మాస్టర్ పూల్ పేరిట మరో 20 వేలు మొత్తం 85 వేల హెచ్-బి వీసాలు మంజూరు చేస్తుంది. వీటిలో దాదాపు 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. తాజాగా ప్రతిపాదించిన 15 శాతం వీసాల నిబంధన అమల్లోకి వస్తే భారత సంస్థలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. అయితే అమెరికాలో ఆయా సంస్థల్లో ఉన్న ఖాళీలు, నిపుణుల కొరతను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఓపీటీ విధానంలో ముందుగా తాత్కాలిక ఉద్యోగం, తర్వాత శాశ్వత కొలువు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా.. ఓపీటీ ముఖ్యాంశాలు

- ఓపీటీ విధానంలో దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు ముందుగా తమ ఇన్‌స్టిట్యూట్ అధికారులను సంప్రదించాలి. ఇన్‌స్టిట్యూట్ అధికారులు స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్‌లో వివరాలు పొందుపరుస్తారు. ఆ తర్వాత సదరు విద్యార్థులు ఐ-765గా పేర్కొనే ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ అప్లికేషన్‌ను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగానికి దరఖాస్తు చేయాలి. ఆ దరఖాస్తుకు ఆమోదం లభిస్తే.. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ) పేరుతో అనుమతి లభిస్తుంది. దానిద్వారా అభ్యర్థులు తమ కోర్సుకు సరితూగే సంస్థల్లో ఓపీటీ విధానంలో పని చేసేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఓపీటీలు.. రెండు రకాలు :
- ప్రీ కంప్లీషన్ ఓపీటీ, పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ పేరుతో రెండు రకాల విధానాలు అమలవుతున్నాయి.
- ప్రీ కంప్లీషన్ ఓటీపీ విధానంలో... విద్యార్ధులు కోర్సు చదువుతున్న సమయంలోనే సంస్థల్లో పని చేసే అవకాశం లభిస్తుంది. దీనికి అనుమతి లభించిన విద్యార్థులు.. తరగతులు జరుగుతున్న సమయంలో వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్ పద్ధతిలో, సెలవుల్లో ఫుల్‌టైమ్ విధానంలో పని చేసే వీలుంటుంది.
- పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ విధానంలో.. సంప్రదాయ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు వారానికి 20 గంటలు పార్ట్ టైమ్ విధానంలో లేదా పూర్తి స్థాయిలో 12నెలల పాటు సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగి హోదాలో విధులు నిర్వహించొచ్చు. అదే స్టెమ్ కోర్సుల విద్యార్థులైతే మరో 24 నెలలు పొడిగింపు పొందే వీలుంది. అంటే స్టెమ్ విద్యార్థులు మొత్తం 36 నెలలు పాటు పోస్ట్ కంప్లీషన్ ఓటీపీ పేరుతో తమకు చదువుకు సంబంధించిన సంస్థలు, విభాగాల్లో పని చేయొచ్చు.
ముందుగానే దరఖాస్తు :
- ఓటీపీ విధానంలో అమెరికాలోని సంస్థల్లో పని చేయాలనుకుంటున్న విద్యార్థులు ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం కోర్సు సమయంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
- స్టెమ్ కోర్సులు చదువుతూ ప్రీ కంప్లీషన్ ఓపీటీ కోసం కోర్సు ముగియడానికి 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ కంప్లీషన్ ఓటీపీ ఔత్సాహికులు కోర్సు ముగియడానికి 90 రోజుల ముందు నుంచి కోర్సు ముగిసిన తర్వాత 60 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెమ్ కోర్సుల విద్యార్థులు 24 నెలల పొడిగింపు కోరుకుంటే.. 12 నెలల ఓటీపీ ముగియడానికి 90 రోజుల ముందే దరఖాస్తు చేసుకోవాలి.
- స్టెమ్ విభాగానికి చెందని కోర్సులు చదువుతూ ఓపీటీ కోరుకుంటున్న అభ్యర్థులు ప్రీ కంప్లీషన్ ఓపీటీ కోసం కోర్సు ముగియడానికి 90 రోజుల ముందుగానే దరఖాస్తు చేయాలి. పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ ఔత్సాహిక విద్యార్థులు కోర్సు ముగియడానికి 90 రోజులు ముందుగా, కోర్సు ముగిశాక 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
మెరుగైన పనితీరుతో హెచ్-1బి వీసా :
ఓటీపీ సమయంలో చక్కటి పనితీరు కనబరిస్తే.. హెచ్-1బీ వీసా పొందే అవకాశం ఉంటుంది. అధిక శాతం సంస్థలు ఓటీపీ అభ్యర్థుల తరఫున పిటిషన్లు దాఖలు చేస్తున్నట్లు యూఎస్ ఇమిగ్రేషన్ వర్గాల సమాచారం. ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. స్టెమ్ విభాగంలో నైపుణ్యాలున్న స్థానిక యువత లభించకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. హెచ్-1బీకి పిటిషన్ దాఖలైతే అలాంటి అభ్యర్థులు ఓపీటీ ముగిసిన సమయానికి హెచ్-1బీ వీసా మంజూరుకు మధ్య ఉన్న వ్యవధిలో అమెరికాలోనే నివసించేందుకు అనుమతి లభిస్తుంది. ఈ విషయంలో క్యాప్ గ్యాప్ అనే విధానం అమలవుతోంది. అంటే.. ప్రతిఏటా హెచ్-1బీ పిటిషన్ల మంజూరు ఏప్రిల్1న జరుగుతుంది. వాటిని పొందిన అభ్యర్థులు అక్టోబర్1 నుంచి విధుల్లో చేరే వీలుంది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఏప్రిల్1 కంటే ముందే ఓపీటీ పూర్తి చేసుకొని హెచ్-1బీ పిటిషన్‌కు అవకాశం పొందినా.. అక్టోబర్1 వరకు పని చేసే అవకాశం ఉండదు. ఈ సమయంలో అభ్యర్థులు స్వదేశానికి వెళ్లాల్సి ఉంటుంది.
ఎఫ్-1 టు హెచ్1.. కఠినంగా!
ఓపీటీ పూర్తి చేసుకున్న తర్వాత హెచ్-1బి వీసా మంజూరుకు ట్రంప్ సర్కారు క్లిష్టమైన నిబంధనల దిశగా అడుగులు వేస్తోంది. భారతీయులకు హెచ్-1బీ వీసాల జారీపై మరింత కఠిన వైఖరి తీసుకుంటోంది. ప్రతి ఏటా మంజూరు చేసే హెచ్-1బీ వీసాల్లో 15 శాతం మాత్రమే భారతీయులకు ఇవ్వాలనే ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ప్రతిఏటా లాటరీ విధానంలో 65 వేల హెచ్-1బి వీసాలు, అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారి కోసం మాస్టర్ పూల్ పేరిట మరో 20 వేలు మొత్తం 85 వేల హెచ్-బి వీసాలు మంజూరు చేస్తుంది. వీటిలో దాదాపు 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. తాజాగా ప్రతిపాదించిన 15 శాతం వీసాల నిబంధన అమల్లోకి వస్తే భారత సంస్థలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. అయితే అమెరికాలో ఆయా సంస్థల్లో ఉన్న ఖాళీలు, నిపుణుల కొరతను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రస్తుతం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఓపీటీ విధానంలో ముందుగా తాత్కాలిక ఉద్యోగం, తర్వాత శాశ్వత కొలువు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా.. ఓపీటీ ముఖ్యాంశాలు
- సంప్రదాయ కోర్సులు చదువుతున్న విద్యార్థులు సంబంధిత విభాగాల్లో ఏడాది వ్యవధిలో తాత్కాలిక పద్ధతిలో పని చేసే అవకాశం.
- స్టెమ్ కోర్సుల విద్యార్థులకు 36 నెలలు పని చేసే వీలు.
- తాత్కాలిక పని వ్యవధిలో ప్రతిభ చూపితే సంస్థ యాజమాన్యం ద్వారా హెచ్-1బీ వీసా పొందొచ్చు.
- డెరైక్ట్ హెచ్-1బి పిటిషన్ల విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు ఓపీటీ ద్వారా తగ్గే అవకాశం.
Published date : 12 Jul 2019 12:54PM