భాష (బోధన పద్ధతులు)
Sakshi Education
టెట్ కమ్ టీఆర్‌టీ-2014కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తెలుగు మెథడాలజీపై ప్రత్యేక దృష్టిని సారించాలి. ఎస్‌జీటీ, లాంగ్వేజ్ పండిట్స్ అభ్యర్థులు డీఎడ్ - తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాన్ని చదవాలి. గణితం, ఫిజికల్ సైన్‌స, బయాలజీ, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సిద్ధమయ్యేవారు బీఎడ్ - తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను చదవాలి. గత టెట్, డీఎస్సీ పరీక్షల్లో తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు డీఎడ్- తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకంలో మొదటి అధ్యాయం ‘భాష’ గురించి సమగ్రంగా తెలుసుకుందాం.
మాదిరి ప్రశ్నలు
- భాష అనే పదం ఏ ధాతువు నుంచి వచ్చింది?
- భాస్
- భాష్
- భాశ్
- భాష్యతి
- భాష్యత ఇతిభాషా అంటే అర్థమేమిటి?
- భావ వినిమయ సాధనం భాష
- భావ గ్రహణ సాధనం భాష
- భాషించేది భాష
- భావ ప్రకటన చేసేది భాష
- ‘మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష’ అని ఎవరన్నారు?
- హాకెట్
- సైమన్ పాటర్
- ఎన్.కృష్ణస్వామి
- రామచంద్రవర్మ
- ‘పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష’ అని ఎవరన్నారు?
- హాకెట్
- రామచంద్రవర్మ
- ఎస్.కె.వర్మ
- రామచంద్ర శుక్లా
- మనసులోని భావ పరంపరను ఏ పదాలు, ఏ వాక్యాలు ఎదుటివారికి అందిస్తాయో, ఆ పదాలు, ఆ వాక్యాలే భాష అని నిర్వచించింది?
- హాకెట్
- సైమన్ పాటర్
- రామచంద్ర శుక్లా
- రామచంద్ర వర్మ
- బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని ఎవరన్నారు?
- ఐజ్లర్
- రామచంద్రవర్మ
- హాకెట్
- సైమన్ పాటర్
- క్రియా పదాల నుంచి భాష పుట్టిందన్న ధాతువాదాన్ని సమర్థించిన భారతీయ భాషావేత్త?
- కాత్యాయనుడు
- యాస్కాచార్యుడు
- ఋష్యశృంగుడు
- మాక్స్‌ముల్లర్
- ప్రకంపన వాదమని ఏ వాదాన్ని అంటారు?
- పూ-పూ వాదం
- యోహిహో వాదం
- డింగ్-డాంగ్ వాదం
- భౌవౌ వాదం
- డింగ్-డాంగ్ వాదాన్ని ఎవరు ప్రతి పాదించారు?
- యాస్కాచార్యుడు
- మాక్స్‌ముల్లర్
- చామ్‌స్కీ
- కాత్యాయనుడు
- ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి ఉద్వే గాల ప్రకటనాభిలాషే భాషకు మూలమని చెప్పిన వాదం?
- ప్రకంపన వాదం
- యొహిహో వాదం
- పూ-పూ వాదం
- వివక్షా ప్రేరణ వాదం
- చామ్‌స్కీ అనే హేతువాది ప్రతిపాదించిన వాదం?
- సంపాదన వాదం
- స్వతస్సిద్ధ వాదం
- సాంకేతిక వాదం
- ధాతు వాదం
- తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధా రంగా ప్రతిపాదించిన వాదం?
- సంపాదన వాదం
- సాంకేతిక వాదం
- స్వతస్సిద్ధ వాదం
- ధాతు వాదం
- సంపాదన వాదాన్ని ఇలా కూడా వ్యవ హరిస్తారు?
- ప్రకృతి వాదం
- సాంకేతిక వాదం
- అనుభవ వాదం
- క్రమ పరిణామ వికాస వాదం
- ‘మనిషి పుట్టుకతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ పరిసరాలతో తాను పొందే అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగు తుంది’ అని చెప్పిన వాదం?
- సాంకేతిక వాదం
- సంపాదన వాదం
- స్వతస్సిద్ధ వాదం
- డింగ్-డాంగ్ వాదం
- ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ఏ భాషావాదాన్ని సమర్థిస్తుంది?
- స్వతస్సిద్ధవాదం
- క్రమ పరిణామ వికాస వాదం
- సాంకేతిక వాదం
- సంపాదన వాదం
- ఏ శాస్త్రంలోని ప్రవృత్తివాదం సంపాదన వాదాన్ని బలపరుస్తుంది?
- తత్వశాస్త్రం
- మనస్తత్వశాస్త్రం
- భాషాశాస్త్రం
- జంతుశాస్త్రం
- ఎవరు తన ప్రయోగాల ద్వారా సంపాదన వాదాన్ని నిరూపించారు?
- పావ్‌లోవ్
- మాక్స్‌ముల్లర్
- బి.ఎఫ్.స్కిన్నర్
- థార్‌నడైక్
- ‘భాష ఒక తరం నుంచి తర్వాతి తరాలకు ప్రసరిస్తుంది. అంటే సంస్కృతి వలే భాష కూడా తర్వాత తరతరాలకు సంక్రమిస్తుం ది’. ఇది భాష ఏ లక్షణం?
- ప్రత్యేకత
- ప్రేరణ దూరత
- ద్వివిధ నిర్మాణం
- సాంస్కృతిక ప్రసరణం
- లిపి అనే పదం ఏ భాషలోని డిపి నుంచి పుట్టింది?
- లాటిన్
- గ్రీకు
- పార్శీ
- సంస్కృతం
- ఎక్కడ లభించిన అశోకుని శిలాశాసనం ఆధారంగా 1వ శతాబ్దం నాటికే ఆంధ్ర దేశంలో లిపి ఉన్నట్లు తెలుస్తుంది?
- అద్దంకి
- అమరావతి
- ఎర్రగుడిపాడు
- పొట్లదుర్తి
- తెలుగు లిపి ఏ లిపికి సన్నిహితంగా ఉన్నట్లు అశోకుని శిలాశాసనం వల్ల తెలుస్తుంది?
- పంగలకర్ర లిపి
- కన్నడ లిపి
- బ్రాహ్మీ లిపి
- దేవనాగరి లిపి
- తెలుగు లిపి ఏ లిపి నుంచి ఉద్భవించిందని అంటున్నారు?
- కన్నడ లిపి
- మౌర్య లిపి
- దేవనాగరి లిపి
- దక్షిణ బ్రాహ్మీ లిపి
- ఎవరి కాలంలో ద్రావిడ భాషకు సంబంధించిన ‘ఱ’ అనే అక్షరం శాసనాల్లో కనిపి స్తుంది?
- శాతవాహనులు
- శాలంకాయనులు
- చాళుక్యులు
- విష్ణుకుండినులు
- లిపి పరిణామ క్రమాన్ని తెలుగు భాషా చరిత్ర అనే గ్రంథంలో చక్కగా వివరించినవారు?
- జి.యన్. రెడ్డి
- భద్రిరాజు కృష్ణమూర్తి
- పి.ఎస్. సుబ్రహ్మణ్యం
- తూమాటి దోణప్ప
- చాళుక్య వంశానికి చెందిన ఎరికల్ ముత్తురాజు వేయించిన తొలి తెలుగు శాసనం ఎక్కడ లభిస్తుంది?
- కలమందలపాడు
- అద్దంకి
- ఎర్రగుడిపాడు
- పొట్లదుర్తి- మాలెపాడు
- నన్నయ ఏ లిపిలో భారతం రాశాడు?
- దేవనాగరి లిపి
- వేంగి చాళుక్య లిపి
- బ్రాహ్మీ లిపి
- మూలద్రావిడ లిపి
- ఏ కవి కాలం నాటి లిపికి, నేటి తెలుగు లిపికి సన్నిహిత సంబంధం ఉంది?
- నన్నయ
- తిక్కన
- పాల్కురికి సోమనాథుడు
- శ్రీనాథుడు
- తెలుగు వర్ణమాలలోని చ, జ అక్షరాల్లో దంత్యోచ్ఛారణ కోసం ‘ ’్త గుర్తును ఎవరు చేర్పించినట్లు గుర్తించారు?
- సి.పి. బ్రౌన్
- చిన్నయసూరి
- బిషప్ కాల్ద్వెల్
- వేటూరి ప్రభాకరశాస్త్రి
- తెలుగు భాషకు చిన్నయసూరి రాసిన అత్యంత ప్రామాణిక వ్యాకరణ గ్రంథం?
- ప్రౌఢ వ్యాకరణం
- సూత్రాంధ్ర వ్యాకరణం
- ఆంధ్రశబ్ద లక్షణ సంగ్రహం
- బాల వ్యాకరణం
- ‘తెలుగునకు వర్ణములు ముప్పదియారు’ అని ఎవరు ఏ గ్రంథంలో చెప్పారు?
- ప్రౌఢ వ్యాకరణం- బహుజనపల్లి సీతారామాచార్యులు
- బాల వ్యాకరణం- చిన్నయసూరి
- ఆంధ్రశబ్ద చింతామణి- నన్నయ
- శబ్దరత్నాకరం- బహుజనపల్లి సీతారా మాచార్యులు
- మనకు గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం?
- ధ్వని
- వాక్యం
- భావ ప్రకటన
- భాష
- తనకు తానే మాట్లాడుకోవడం లేదా తనకే పరిమితమైన లేఖనాన్ని ఏమంటారు?
- గ్రహణం
- అభివ్యక్తి
- ఆత్మగతం
- ప్రకాశం
- భాషోపాధ్యాయుడు తరగతి గదిని ఎలా భావించి, కృత్రిమ సన్నివేశాలు, ఘట్టాలు, సృష్టించి విద్యార్థులకు అనుభవపూర్వకమైన భాషా వినియోగం కలిగించాలి?
- ఒక ప్రయోగశాలగా
- సౌరకుటుంబంలా
- ఒక సూక్ష్మ సమాజంగా
- వసుధైక కుటుంబంగా
- భాషాధ్వనులకు పుట్టుక, పలకడంలో ముఖయంత్ర వినియోగం, ధ్వనితరంగాల లక్షణం వివరించేది?
- వ్యాకరణ శాస్త్రం
- భాషాశాస్త్రం
- మనోవిజ్ఞాన శాస్త్రం
- ధ్వని విజ్ఞానం
- వాగుత్పత్తిలో కంఠం, తాలువు, మూర్థం, దంత మూలం, పై పెదవి వీటిని ఏమంటారు?
- కంఠధ్వనులు
- స్థానాలు
- కరణాలు
- ప్రయత్నాలు
- వాగుత్పత్తిలో జిహ్వ, ఓష్ఠం, గళగర్తం లను ఏమంటారు?
- కరణాలు
- స్థానాలు
- ప్రయత్నాలు
- ధ్వని వర్ణాలు
- నన్నయ నుంచి పరవస్తు చిన్నయసూరి వరకు వెల్లివిరిసిన సాహిత్యమంతా ఏ భాష లో నిక్షిప్తమైంది?
- ప్రామాణిక భాష
- సరళగ్రాంథిక భాష
- గ్రాంథిక భాష
- మాండలిక భాష
- ప్రామాణిక భాషనే ఇలా వ్యవహరిస్తారు?
- మాండలికం
- గ్రాంథికం
- వ్యవహారికం
- శిష్ట వ్యవహారికం
- వ్యవహారిక భాష కోసం ఉద్యమం చేప ట్టినవారు?
- వేదం వెంకటరాయశాస్త్రి
- గిడుగు సీతారామశాస్త్రి
- గిడుగు రామమూర్తి
- గురజాడ అప్పారావు
- ఉపభాష, ప్రాదేశిక భాష అని ఏ భాషను పిలుస్తారు?
- వ్యవహారికం
- గ్రాంథికం
- మాండలికం
- ప్రామాణికం
- ఏ మండలంలో సొమ్ములు అంటే ఆవులు అని అర్థం?
- పూర్వ మండలం
- మధ్య మండలం
- దక్షిణ మండలం
- ఉత్తర మండలం
- నాగలిని మడక అని ఏ ప్రాంతంలో పిలుస్తారు?
- గోదావరి
- కోస్తాంధ్ర
- తెలంగాణ
- రాయలసీమ
- మూలభాష నుంచి లక్ష్యభాషలోకి భాషాం తరీకరణం చేసే నేర్పును ఏమంటారు?
- అనుకరణశక్తి
- భాషాంతరీకరణ సామర్థ్యం
- లక్ష్యాధారిత సామర్థ్యం
- భాషా వినియోగం
- ‘మూల భాషా రచనాశైలి లక్ష్యభాషలో కూడా ఉంటూ, మూలానికి కట్టుబడి చేసే అనువాదం’ ఏది?
- మూలానువాదం
- మూల విధేయానువాదం
- స్వేచ్ఛానువాదం
- పదానువాదం
- అనువాదకుడు లక్ష్యభాషకు తగిన, తనదైనశైలిని, స్వతంత్రతను ప్రదర్శిస్తే దానిని ఏమంటారు?
- స్వేచ్ఛానువాదం
- భావానువాదం
- పదానువాదం
- మూల విధేయానువాదం
- దినచర్య రహస్యలేఖలు దేనికి ఉదా హరణలు?
- ప్రకాశం
- అభివ్యక్తం
- గ్రహణం
- ఆత్మగతం
సమాధానాలు
1) 2; | 2) 3; | 3) 2; | 4) 1; | 5) 4; | 6) 1; |
7) 2; | 8) 1; | 9) 2; | 10) 4; | 11) 2; | 12) 1; |
13) 3 | 14) 2; | 15) 4; | 16) 2; | 17) 3; | 18) 4; |
19) 3; | 20) 2; | 21) 3; | 22) 4; | 23) 4; | 24) 2; |
25) 3; | 26) 2; | 27) 4; | 28) 1; | 29) 4; | 30) 3; |
31) 4; | 32) 3; | 33) 3; | 34) 4; | 35) 2; | 36) 1; |
37) 3; | 38) 4; | 39) 3; | 40) 3; | 41) 1; | 42) 4; |
43) 2; | 44) 2; | 45) 1; | 46) 4. |
|
|
గత టెట్, డీఎస్సీ ప్రశ్నలు
- భాషకు మూలం?
- వాక్యం
- ధ్వని
- భావం
- ఆలోచన
- భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించినవారు?
- నోమ్‌చామ్‌స్కీ
- బ్లూమ్‌ఫీల్డ్
- యాస్కాచార్యుడు
- కాత్యాయనుడు
- ఆంధ్రభాషా బోధన సరస్వం పుస్తక రచయిత?
- శ్రీరామచంద్రుని వేంకట శేషయ్య
- పావులూరి కామేశ్వరరావు
- గొడవర్తి సూర్యనారాయణ
- కె.వి.వి.యల్. నరసింహారావు
- మాక్స్‌ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం?
- ధ్వన్యనుకరణ సిద్ధాంతం
- ధాతు జన్యువాదం
- డింగ్ డాంగ్ వాదం
- భగవదత్తం
- ‘ఉండుద్ది, వచ్చుద్ది’ మొదలైన క్రియా పదాలు వాడుకలో ఉన్న జిల్లా?
- తూర్పుగోదావరి
- పశ్చిమగోదావరి
- కృష్ణా
- గుంటూరు
- బిందుపూర్వక ‘బ’ కారం ఏ భాషలో కన్పిస్తుంది?
- మాండలిక
- గ్రాంథిక
- ప్రామాణిక
- వ్యవహారిక
- ప, ఫ, బ, భ, మ అనే వర్ణాలు?
- దంత్యాలు
- దంత్యోష్ట్యాలు
- ఓష్ఠ్యాలు
- తాలవ్యాలు
- వ్యవహారంలో ఉణ్యాధి క్రియారూపం కనిపించే జిల్లా?
- శ్రీకాకుళం
- నెల్లూరు
- ఆదిలాబాద్
- తూర్పుగోదావరి
సమాధానాలు
1) 2; | 2) 3; | 3) 1; | 4) 3; | 5) 4; | 6) 2; |
7) 3; | 8) 2. |
|
|
|
|
Published date : 20 Dec 2014 06:18PM