Skip to main content

సౌరకుటుంబం - మన భూమి

1. భూమి ఏ ఆకారంలో ఉంది?
జ. గోళాకారం

2. భూమి ఆకారానికి మంచి నమూనా?
జ. గ్లోబు

3. భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం?
జ. సూర్యుడు

4. దూరాన్ని బట్టి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమి ఎన్నో స్థానంలో ఉంది?
జ. 3వ స్థానం

5. సూర్యుని చుట్టూ తిరిగో గోళాలను ఏమంటారు?
జ. గ్రహాలు

6. ఉపగ్రహాలు అంటే?
జ. గ్రహాల చుట్టూ తిరిగే చిన్న గోళాలు

7. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం?
జ. చంద్రుడు

8. ప్రతి 15 రోజుల కాలంలో చంద్రుడి పరిమాణం క్రమంగా తగ్గుతూ తిరిగి 15 రోజులు పెరుగుతూ ఉండడాన్ని ఏమంటారు?
జ. చంద్రకళలు

9. సౌరకుటుంబం అంటే?
జ. సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు

10. ఒక గ్రహం చుట్టూ పరిభ్రమించే మానవ నిర్మిత యంత్ర పరికరమే?
జ. కృత్రిమ ఉపగ్రహం

11. పాలవెల్లి అంటే?
జ. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం

12. పాలవెల్లికి మరో పేరు?
జ. ఆకాశగంగ, పాలపుంత

13. లఘుగ్రహాలు అంటే
జ. సౌరకుటుంబంలో మన కంటికి కనబడని చిన్న చిన్న శిలా శకలాలు

14. సూర్యగోళం భూమి కంటే ఎంత పెద్దది?
జ. 1.3 రెట్లు

15. సూర్యుడి ఉపరితలం, కేంద్రం వద్ద ఉష్ణోగ్రతలు వరుసగా?
జ. 6000°C, 1,00,000°C

16. భూమికి అతి దగ్గరలో ఉన్న గ్రహం?
జ. బుధుడు

17. సూర్యుని నుంచి దూరాన్ని బట్టి ఆరో స్థానంలో ఉన్న గ్రహం?
జ. శని

18. భూమి సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది?
జ. 149.4 మిలియన్ కిలో మీటర్లు

19. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?
జ. 8 నిమిషాలు

20. ఉపగ్రహాలు లేని గ్రహాలు?
జ. బుధుడు, శుక్రుడు

21. భూమికి, చంద్రుడికి మధ్య దూరం?
జ. 3,84,365 కి.మీ.

22. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు అనేవి?
జ. అంతరగ్రహాలు

23. బృహస్పతి, శని, వరుణుడు, ఇంద్రుడు?
జ. బాహ్యగ్రహాలు

24. గ్రహాలన్నింటిలో అతి పెద్దది?
జ. బృహస్పతి

25. గ్రహాల పరిమాణంలో భూమి స్థానం?
జ. ఐదు
Published date : 07 Jul 2012 02:24PM

Photo Stories