Skip to main content

భూచలనాలు - వాటి ఫలితాలు

1. భూమికి ఎన్ని రకాల చలనాలు ఉన్నాయి?
జ. రెండు 1) భూభ్రమణం 2) భూపరిభ్రమణం

2. భూమి తన చుట్టూ తాను తన అక్షంపై ఏ దిశలో తిరుగుతుంది?
జ. పశ్చిమం నుంచి తూర్పుకు

3. భూభ్రమణం వేగం గంటకు?
జ. 1610 కి.మీ.

4. ఉత్తర, దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి (కేంద్రం) ద్వారా గీసిన ఊహారేఖను ఏమంటారు?
జ. భూమి అక్షం

5. భూమి ‘అక్షం’ వాలు?
జ. 23 1/2ని

6. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం?
జ. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు

7. భూభ్రమణాన్ని గమనించడానికి మంచి మోడల్?
జ. తిరుగుతున్న బొంగరం

8. భూభ్రమణం ఫలితాలు?
జ. పగలు, రాత్రులు ఏర్పడతాయి. పవనాల మార్గాలలోను, సముద్ర ప్రవాహాల మార్గాల్లోను మార్పులు వస్తాయి.

9. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం?
జ. భూపరిభ్రమణం

10. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గం?
జ. కక్ష్య

11. భూకక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది? దాని పొడవెంత?
జ. దీర్ఘవృత్తాకారం, 965 మిలియన్ కి.మీ.

12. భూమి సూర్యుని చుట్టూ ఓసారి తిరగడానికి పట్టే సమయం?
జ. 365 రోజుల 6 గంటల 54 సెకన్లు, (365 1/4 రోజులు)

13. సంవత్సరానికి 366 రోజులు ఉండే సంవత్సరాన్ని ఏమంటారు?
జ. లీపు సంవత్సరం

14. భూపరిభ్రమణం వల్ల ఫలితాలు?
జ. పగలు, రాత్రి వేళల్లో తేడాలు, ఋతువులు ఏర్పడడం.

15. భూపరిభ్రమణ సమయంలో భూమికి, సూర్యుడికి మధ్య అత్యధిక దూరం ఉండే స్థితిని ఏమంటారు?
జ. అపహేళి

16. భూమికి, సూర్యుడికి అత్యల్ప దూరం ఉండే స్థితి?
జ. పరిహేళి

17. భూమధ్యరేఖ మీద సూర్యకిరణాలు లంబంగా పడే రోజు?
జ. మార్చి 21, సెప్టెంబర్ 23

18. ‘విషవత్తులు’ అంటే?
జ. రేయింబవళ్ళు సమానంగా ఉండే రోజులుః మార్చి 21, సెప్టెంబర్ 23

19. జూన్ 21న సూర్యకిరణాలు లంబంగా పడే ప్రదేశం?
జ. కర్కట రేఖ

20. మకరరేఖపైన సూర్యకిరణాలు లంబంగా పడే రోజు?
జ. డిసెంబర్ 22

21. భూపరిభ్రమణం వల్ల ఋతువులు (కాలాలు) ఏర్పడ్డానికి ప్రధాన కారణం?
జ. భూమి అక్షం 23 1/2° వాలి ఉండడం
Published date : 07 Jul 2012 02:25PM

Photo Stories