Skip to main content

స్మార్ట్‌గా విద్య: 92.9% మంది విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా రంగానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యం సత్ఫలితాలనిస్తోంది.
రాష్ట్ర విభజన జరిగాక ఐదేళ్లలో ఏపీలో విద్యా రంగం అస్తవ్యస్తంగా మారగా ప్రస్తుత ఏడాది (2020)కి అద్భుత రీతిలో పురోగమించింది. తాజాగా దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసర్) ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ స్కూళ్లలో భారీగా విద్యార్థుల చేరికలు పెరిగిన సంగతి తెలిసిందే. వీరి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. తద్వారా 2018తో పోల్చి చూస్తే 2020లో ప్రభుత్వ స్కూళ్లల్లో చదువుతున్న విద్యార్థుల కుటుంబాల పరిస్థితి భారీగా మెరుగుపడింది. అసర్-2020 నివేదికలోని పలు గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

పెద్ద రాష్ట్రాలతో ఏపీ పోటీ..
2018, 2020 సంవత్సరాల్లో విద్యార్థుల కుటుంబాలకు అందుబాటులో ఉన్న కొన్ని సదుపాయాలపై అసర్ సర్వే నిర్వహించింది. కరోనా లాక్‌డౌన్ సమయంలో విద్యార్థుల అభ్యసనానికి అవసరమైన వనరులు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయో ఈ సర్వే తెలిపింది. విద్యార్థులు వారు చేరిన స్కూళ్లను బట్టి.. వారి కుటుంబాలకు ఉన్న మౌలిక వనరులను, వివిధ సదుపాయాల గురించి పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో 35.2 శాతం మందికి, ప్రైవేటు స్కూళ్లలోని 53.7 శాతం మంది విద్యార్థుల కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అదే 2020లో ప్రభుత్వ పాఠశాలల్లో 57 శాతం మంది పిల్లల కుటుంబాలకు స్మార్ట్ ఫోన్లు ఉండగా ప్రైవేటు పాఠశాలల్లో 72.9 శాతం మందికి ఆ సదుపాయం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల కుటుంబాలకు స్మార్ట్ ఫోన్ల లభ్యత 22 శాతం పెరిగింది. తద్వారా ఈ ప్రాథమిక వనరుల అందుబాటులో 2018 నాటికి ఎంతో వెనుకబడి ఉన్న ఏపీ 2020కి అగ్రశ్రేణిలో ఉన్న కేరళ, తమిళనాడు, పంజాబ్ వంటి రాష్ట్రాల సరసన చేరింది.

ఒక్క ఏడాదిలోనే పుంజుకున్న ప్రభుత్వ విద్యా రంగం
ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు మొత్తం విద్యార్థుల కుటుంబాల్లో 2018లో స్మార్ట్ ఫోన్లు 42.1 శాతం మందికి, టీవీలు 91.8 శాతం మందికి ఉన్నాయి. 2020కి వచ్చేసరికి స్మార్ట్ ఫోన్లు 61.5 శాతం మందికి, టీవీలు 92.9 శాతం మందికి ఉండటం గమనార్హం. రాష్ట్ర విభజన జరిగాక ఐదేళ్లలో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర విద్యారంగం.. ముఖ్యంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఒక్క ఏడాది (2020)లోనే పుంజుకోవడం విశేషం.

రాష్ట్రంలోని విద్యార్థుల కుటుంబాల్లో ఉన్న సదుపాయాలు (శాతాల్లో ) ఇలా..

కుటుంబ వనరులు

2018

2020

 

ప్రభుత్వ

ప్రైవేటు

ప్రభుత్వ

ప్రైవేటు

స్మార్ట్ ఫోన్లు

35.2

53.7

57

72.9

టీవీ

89.4

95.9

92.9

92.9


ప్రభుత్వ
, ప్రైవేటు రెండింటినీ కలిపి చూసినా ఆయా వనరుల అందుబాటులో ఇతర పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతూ ఏపీ ముందు వరుసలో ఉంది. 2020 గణాంకాలు (శాతాల్లో ..)

రాష్ట్రం

స్మార్ట్‌ఫోన్లు

టీవీలు

ఆంధ్రప్రదేశ్

61.5

92.9

తెలంగాణ

74

90.5

కేరళ

94.3

86.6

తమిళనాడు

64.1

92.6

కర్ణాటక

68.6

82.8

మధ్యప్రదేశ్

62.7

62.7

పంజాబ్

88.5

89

హరియాణా

82.3

77.5

ఉత్తరప్రదేశ్

53.7

48.5

పశ్చిమ బెంగాల్

47.4

50.5

మహారాష్ట్ర

76.3

78.1

గుజరాత్

84

82.9

Published date : 19 Nov 2020 01:43PM

Photo Stories