Skip to main content

గ్రామీణ యువతకు ఐబీఎం సాంకేతికత శిక్షణ

న్యూఢిల్లీ: కామన్ సర్వీసెస్ సెంటర్ అకాడమీ ద్వారా సాంకేతిక విద్యా, నైపుణ్య శిక్షణ అందించేందుకు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో చేతులు కలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ సర్వీసెస్ అందించే లక్ష్యంతో కేంద్ర ఐటీ విభాగం రూపొందించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్ (సీఎస్‌సీ)లో భాగమే సీఎస్‌సీ అకాడమీ. గ్రామీణ యువత, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ టెక్నాలజీ వంటి ప్రత్యేకమైన కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలుంటాయి. అనంతరం ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు 4 వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు ఐబీఎం ఇండియా, సౌత్ ఏషియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌లో ఐబీఎంతో పాటు సీఎస్‌ఆర్ బాక్స్, యువ జాగృతి సంస్థాన్‌లు భాగస్వామ్యమయ్యాయని, సాంకేతిక విద్యా అవసరాలు, అభ్యాసకుల సామర్థ్యం మెరుగవుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 3.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో సీఎస్‌సీ అకాడమీ మద్దతునిస్తుందని, వీటిల్లో 60 వేలు మహిళా కేంద్రాలున్నాయని సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండీ దినేత్ త్యాగి తెలిపారు.
Published date : 27 Nov 2020 02:04PM

Photo Stories